Fake Seeds: నకిలీ విత్తనాల పంజా.. అన్నదాతల విలవిల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరుగాలం శ్రమించి అరక దున్ని విత్తనాలు వేసినా అవి మొలకెత్తుతాయన్న ఆశలేదు. కొందరు కేటుగాళ్ళ కారణంగా అన్నదాతలకు అగచాట్లు తప్పడంలేదు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మారుమూల గ్రామాలపై నకిలీ విత్తనాలు పంజా విసురుతున్నాయి. అమాయక రైతులే టార్గెట్ గా కార్యకలాపాలు అప్పుడే మొదలెట్టేశారు. మంచిర్యాల, కొమురంభీం జిల్లాలో నిషేధిత పత్తివిత్తనాలు అమ్మే ముఠాలు ఎక్కడి నుంచివస్తున్నాయో తెలీడం లేదు.
ఏటా ఇదేతంతు జరుగుతున్నా అధికారుల నిఘా కొరవడుతుంది. విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు గ్రామాల్లోకి ఇప్పటికే వచ్చిచేరాయి. పోలీసుల తనిఖీలలో కొన్నే బయటపడుతున్నాయి. రైతులకు చేరాల్సినవి చేరిపోతున్నాయి.
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్ ఉమ్మడిజిల్లాలో కొన్నిప్రాంతాలపై నకిలీ విత్తనాలు దాడి చేస్తున్నాయి. మారుమూల గ్రామాలను అక్కడి రైతులను మచ్చిక చేసుకుని నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. మంచిర్యాలజిల్లాలో ఒక్కరోజు తనిఖీలు చేపడితే ఒక క్వింటాల్ 18 కిలోల నకిలీవిత్తనాలు దొరికాయంటే ఏమేరకు నకిలీ రాయుళ్ళు వేళ్లూనుకుపోతున్నారో అర్థం అవుతుంది.
మంచిర్యాలజిల్లా తాండూరు .భీమిని ,నెన్నెల, కన్నెపల్లి మండలంలోని రైతులు పెద్ద ఎత్తున విత్తనాలు నిల్వచేశారు. తాండూర్ మండలంలో ఓవ్యాపారి ఏటా కోట్ల వ్యాపారం చేస్తున్నారనే విషయం ప్రచారంలో వుంది. గతంలో రెండుమూడుసార్లు పట్టుబడ్డా ఇప్పటికీ ఆ వ్యాపారం వదల్లేదు. తాండూరు ,రెబ్బన,తిర్యాణి మండలాలకు సైతం ఇక్కడినుంచే విత్తనాల సరఫరా జరుగుతుంది. వీరికి కొందరు పోలీసులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటుచేసి నకిలీ విత్తనాలు అరికట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ మూడుమండలాల్లో 118 కిలోల నకిలీ పత్తివిత్తనాలు సీజ్ చేశారు.
బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలుర రైసుమిల్లులలో నిల్వ ఉంచారని సమాచారం అందగా అక్కడికి వెళ్ళేలోపే విత్తనాలు మాయం చేశారట. అయితే ఎవరో సమాచారం అందించారని ప్రత్యేక టీంలు భావించాయి. అక్కడ ఏటా ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది రైతుల ముసుగులో ఇక్కడికి వచ్చి హెచ్ జీ కాటన్ సీడ్స్ సేల్ చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు నిల్వలు ఏర్పాటుచేయటంతో పాటు పలు గ్రామాల్లో రైతులకు అంటగట్టినట్టు తెలిసింది.తాజాగా నెన్నెల , తాండూర్, భీమిని పరిధిలోనే 118 కిలోల నకిలీ విత్తనాలు దొరికాయని, వీటిపై విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
వ్యవసాయశాఖ నిఘా లేకపోవడంతో అక్రమార్కులు విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతేడాది రెండు పీడీయాక్ట్ లు, 20 కేసులు నమోదుచేశామని అధికారులు చెబుతున్నారు. మళ్ళీ నకిలీ విత్తనాలు నిల్వచేయడంతో కలకలం రేగుతోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ఏదో చేస్తాం అని చెప్పినా నకిలీ రాయుళ్ళ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. గతంలో కేసుల్లో వున్నవారు అదే పని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. అధికారులు పకడ్బందీ చర్యలు చేపటకపోతే రైతులు భారీగా నష్టపోకతప్పదంటున్నారు.
Read Also: Power Cut Effect: అనంతపురంలో పరిశ్రమలకు విద్యుత్ షాక్
తాజావార్తలు
-
Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!