Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Fake Certificates Gang Arrested By Hyderabad Police

Hyderabad: నగరంలో నకిలీ సర్టిఫికెట్ల దందా.. 10 మంది అరెస్ట్

Published Date :February 15, 2022 , 3:45 pm
By Ramesh Nalam
Hyderabad: నగరంలో నకిలీ సర్టిఫికెట్ల దందా.. 10 మంది అరెస్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్ నగరంలో పోలీసులు నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ మేరకు మలక్‌పేట్, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో అంత రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్ల ముఠాను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న 10 మంది అంతర్‌రాష్ట్ర నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి భారీగా ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. నకిలీ సర్టిఫికెట్లతో ఉన్నత విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందన్నారు. మలక్‌పేటలో శ్రీ సాయి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ పేరుతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒక్కో డిగ్రీకి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారని.. తల్లితండ్రులకు తెలిసే విద్యార్థులు నకిలీ సర్టిఫికెట్స్ కొనుగోలు చేస్తున్నారని సీవీ ఆనంద్ తెలిపారు.

నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న రెండు ముఠాలను అరెస్ట్ చేసి వారి నుంచి నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని వారికి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు అమ్ముతున్నారన్నారు. ప్రధాన నిందితుడు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి శ్రీసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ కన్సల్టెన్సీ పెట్టాడని.. టెలీకాలర్లు ఫెయిల్ అయిన విద్యార్థులకు కాల్ చేసి వారిని రప్పిస్తున్నారని తెలిపారు. బీటెక్ సర్టిఫికెట్లు ఇవ్వాలి అంటే రూ.3 లక్షలు, బీఎస్సీ సర్టిఫికెట్‌ కావాలంటే రూ.1.7 లక్షలు, బీకాం సర్టిఫికెట్ కావాలంటే రూ.1.50 లక్షలు వసూలు చేస్తున్నారన్నారు.

ఈ కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కేతన్ సింగ్ సహాయంతోనే ఈ దందా కొనసాగుతుందని హైదరాబాద్ సీపీ పేర్కొన్నారు. SRK యూనివర్సిటీ చైర్మన్ కూడా సంబంధాలు ఉన్నట్లు తేలిందని.. దీనిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. ప్రైడ్ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో కూడా మరో ముఠా ఇలాగే దందా చేస్తున్నారన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను టార్గెట్‌ చేసుకుని ఒక్కో సర్టిఫికెట్‌ను లక్షల్లో అమ్ముతున్నారని తెలిపారు. SRK యూనివర్సిటీ చెందిన 8 నకిలీ సర్టిఫికెట్లు, మధ్యప్రదేశ్‌లోని స్వామి వివేకానంద యూనివర్సిటీకి చెందిన 24 సర్టిఫికెట్లు, యూపీకి చెందిన గ్లోకల్ యూనివర్సిటీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల నుంచి రబ్బర్ స్టాంపులు, వివిధ యూనివర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లను సీజ్ చేశామన్నారు. ఇంకా హైదరాబాద్‌లో మరో 5 నకిలీ సర్టిఫికెట్ల ముఠాలు ఉన్నట్లు గుర్తించామని, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • fake certificates
  • hyderabad
  • Hyderabad CP CV Anand
  • LATEST TELUGU NEWS
  • north zone task force police

తాజావార్తలు

  • PBKS vs GT : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్ కానోలీ.!

  • Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌.. భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు బిగ్‌ షాక్..

  • CM Revanth Reddy : మానవత్వానికి పట్టాభిషేకం.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం భారీ భరోసా.!

  • Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions