Explosion in Secunderabad: సికింద్రాబాద్ రామ్‌గోపాల్ పేటలో పేలుడు సంభవించింది. ఓ అపార్ట్ మెంట్‌లో మొదటి అంతస్తులో పేలుడు జరిగింది. పేలుడు ధాటికి భవనం ధ్వంసమైంది. ఇంట్లో వున్న దంపతులిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమాచారంతో.. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు. గాయాపడిన దంపతులిద్దరిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. పేలుడు ఘటనపై విచారాణ జరుపుతున్నామని , భవనంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. కిచెన్ లో మాత్రం సిలెండర్ కూడా అలానే వుండటం గమనార్హం. సిలిండర్ కూడా లీక్ అయినట్లు ఎటువంటి ఆనవాలు లేవని తెలిపారు.
ఒక వేళ సిలిండర్ పేలి వుంటే భారీ పేలుడు అయ్యే అవకాశం వుంటుందని అన్నారు. కానీ.. అటువంటి ఏదీ జరగలేదని పేర్కొన్నారు. సిలిండర్ వల్లో లేకా.. గ్యాస్ లీక్ వల్ల అయితే ఈ ప్రమాదం జరగలేని అధికారులు అంచనావేశారు. అయితే ఈ పేలుడు ఎలా సంభవించింది, దీని సంబందించిన కారణాలే ఏంటని అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే క్లూటీం రంగంలోకి దిగి ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. భవనంలో అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడం పై పలు అనుమానాలకు దారి తీస్తోంది. అసలు ఈ పేలుడు ఎలా జరిగింది అనేది అధికారులకు ప్రశ్నార్థకంగా మారింది.
Revanth Reddy Live : TPCC Chief Revanth Reddy Sensational Press Meet on Munugodu By Election