Site icon NTV Telugu

Etela Rajender : బీఆర్‌ఎస్‌ను ఏకిపారేసిన ఈటల.. కాంగ్రెస్‌ను అయితే చెప్పనక్కర్లేదు

Etela Rajender

Etela Rajender

Etela Rajender : హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో అనేక అంశాలు ఉన్నాయని, స్థానిక సంస్థల్లో, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ హాయంలో బీసీ శాతం 23 కు పడిపోయిందని ఆయన మండిపడ్డారు. బీసీల కళ్లలో మట్టి కొట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీఅని, బీఆర్ఎస్ పార్టీకి ఓబీసీ ల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన ఏకిపారేసారు. రేవంత్ రెడ్డి ఓటమిని అంగీకరించారని, డిక్లరేషన్ ల పేరిట అనేక హామీలిచ్చారన్నారు. రేవంత్ రెడ్డిని అర్థం చేసుకోలేకపోయామనీ, మోస పోయామని ప్రజలు అనుకుంటున్నారని ఈటల అన్నారు. రిజర్వేషన్ల పేరుతో రేవంత్ రెడ్డి బీసీలను నిలువునా మోసం చేస్తున్నారని, 20 నెలలు దాటిపోయింది రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారన్నారు.

Also Read : BRS vs Congress : హత్నూరలో కాంగ్రెస్-బీఆర్‌ఎస్ బాహాబాహీ..

అంతేకాకుండా..’మోసం చేసిన కాంగ్రెస్ అని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఫీ రియాంబర్స్ మెంట్ లేక పిల్లలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పాత పద్ధతుల్లో ఫీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం, లేకపోతే సీఎం నీ భరతం పడతామని హెచ్చరికలు ఇస్తున్నాం. ఎన్ని హామీలున్నాయో గుర్తుందా రేవంత్ రెడ్డి..?. బీసీ రిజర్వేషన్లపై కమిషన్ వేసిన రేవంత్ రెడ్డి, ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కు చట్ట బద్దత ఉంటదా..?. రిజర్వేషన్లపై మొట్టమొదటి కమీషన్ వేసిన రాష్ట్రం తమిళనాడు. చట్ట బద్దంగా 9th సెడ్యూల్ ల్లో చేర్చుకొని రిజర్వేషన్లను సాధించుకున్న తొలి రాష్ట్రం తమిళనాడు

ఢిల్లీకి వెళ్ళి రేవంత్ డ్రామాలు ఆడుతున్నారు, బీజేపీపై నెపం వేసే కుట్రలు చేస్తున్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని కోర్టులు చెబుతున్నాయి. ఆర్టికల్ 340, కమిషన్ ఎంక్వారి 1942 ప్రకారం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళాలి. బీసీలను మోసం చేసే కుట్రలు రేవంత్ రెడ్డి మానుకోవాలి. రేవంత్ కు ఆత్మశుద్ధి ఉంటే మంత్రి వర్గంలో బీసీలకు ఏం ఇచ్చారు..? ఏం శాఖలు ఇచ్చారో చెప్పాలి. బీ ఆర్ ఎస్ ఉన్నంత కాలం బీసీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ఉన్నంత కాలం బీసీ అధ్యక్షుడు కయ్యే పరిస్థితి లేదు. కాంగ్రెస్ హయాంలో బీసీ ముఖ్యమంత్రిని చేయలేదు, భవిష్యత్ లో కూడా చేస్తారనే నమ్మకం లేదు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి నీ భరతం పడతాం.’ అని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు.

Read Also : 71 National Film Awards : జాతీయ అవార్డులు వచ్చిన వారికి ప్రైజ్ మనీ.. ఎవరికి ఎంత..?

Exit mobile version