కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్బాక లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… కేసీఆర్ పచ్చటి సంసారంలో నిప్పు పెట్టారు. మానవ సంబంధాలకు మచ్చ తీసుకు వస్తున్నారు. గొల్ల కురుమలకు గొర్లు నా రాజీనామా తరువాతనే… అది కూడ హుజూరాబాద్ మాత్రమే వచ్చాయి. అది మీ మీద ప్రేమ కాదు, మీ ఓట్ల మీద ప్రేమ. పెద్దపల్లి ఎమ్మెల్యేకి టికెట్ నేనే ఇప్పించిన, గెలవడానికి నేనే వెళ్లి ప్రచారం చేసిన. ఇప్పుడు ఆయన కూడా వచ్చి ప్రచారం చేస్తున్నాడు. పెద్దపల్లి ప్రజలు నవ్వుకుంటున్నారు. కుట్లో రాయి తీయలేని వాడు ఏట్లో తీస్తా అని పోయాడని. పెద్దపల్లికి వస్తా కాసుకో అని తెలిపారు. కేసీఆర్ బొమ్మతో గెలుస్త అనుకుంటున్నారు. ఇక ఆ బొమ్మకు ఓటు పడదు అన్నారు.
బీజేపీకి ఓటు వేస్తే పథకాలు రావు అంటున్నారట. కేసీఆర్ నువ్వు నిజాం సర్కార్ కాదు. ఇది నీ జాగీరు కాదు. రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తున్నావు. అంబేడ్కర్ ఇచ్చిన హక్కును కాలరాస్తున్నవు. ఎక్కువ రోజులు నడవవు. మా రాజేందర్ అన్నకు కెసిఆర్ అన్యాయం చేశారు అని ప్రతీకారం తీర్చుకోవడానికి హుజూరాబాద్ ప్రజలు సిద్దం అవుతున్నారు. కేసీఆర్ మొఖం చెల్లుత లేదు. రాజేందర్ అన్న పేరు చెబితేనే ఓట్లు పడతాయి అని నా గుర్తు కారు అని చెప్తున్నారట. అప్రమత్తంగా ఉండండి. 2023 లో తెరాసా పార్టీ కథ కంచికే. ఈ సారి కులాల పంచాయతీ కాదు. కెసిఆర్ దుర్మార్గానికి హుజూరాబాద్ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అని పేర్కొన్నారు.