Shamshabad: శంషాబాద్‌లో దుబాయ్ విమానం ఎమర్జెన్సీ లాండింగ్.. నలుగురు ప్రయాణికుల్ని దించేసిన పైలట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dubai flight emergency landing in Shamshabad: నార్కోటిక్ ఫోర్స్ తో వెళ్తున్న ఓ విమానం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. దుబాయ్ నుంచి కొచ్చి వెళ్తున్న విమానంలో నలుగురు ప్రయాణికులు మద్యం తాగి తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించారు. ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించగా.. విమాన సిబ్బందిపైనా, ఇతర ప్రయాణికులపైనా దాడికి యత్నించారు. దీంతో పైలట్ విమానాన్ని దారి మళ్లించి శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. నలుగురిని భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్‌జీఏఐ స్టేషన్ పోలీసులు తెలిపారు.
Read also:Pushpa 2 : తప్పని తిప్పలు తెచ్చిపెడుతున్న ఐటమ్ సాంగ్..?
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
అయితే ఇటీవలి కాలంలో విమానాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. వివరణ గతంలో పలు విమాన ప్రయాణాల్లో చిన్న చిన్న విషయాలకే ప్రయాణికులపై పిడిగుద్దులు కురిపించిన సంగతి తెలిసిందే. మరికొందరు తోటి ప్రయాణికులకు మూత్ర విసర్జన, వాంతులు చేస్తూ ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. మరికొందరు విమాన సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో మహిళా సిబ్బంది ఇలాంటి ప్రయాణికులకు మీ బానిసలు కాదంటూ ఘాటుగా సమాధానమిస్తున్నారు. తోటి ప్రయాణికుడిపై మూత్రం పోసిన ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతను పనిచేసే కంపెనీ కూడా అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే దీని తర్వాత కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం.
Pushpa 2 : తప్పని తిప్పలు తెచ్చిపెడుతున్న ఐటమ్ సాంగ్..?
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!