Etela Rajender: సంచలన వ్యాఖ్యలు.. తెరాస, కాంగ్రెస్ పార్టీ వారు చాలామంది టచ్ లో ఉన్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వారు చాలామంది టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు ఈటెల రాజేందర్. మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ జెండా ఎగురవేసి జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు ఈటల కు ఖడ్గం బహూకరించారు. పలువురికి ఈటల రాజేందర్ కాషాయ జెండా కప్పి బీజేపీ లోకి స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ ప్రజనికానికి శుభదినమన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఒక ఆదివాసీ మహిళను అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టి అణగారిన వర్గాల పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో నరేంద్ర మోదీ నిరూపించుకున్నారు. కేంద్ర మంత్రివర్గంలో కూడా సామాజిక న్యాయం పాటించారు. 70 శాతం మంది బడుగు బలహీన వర్గాల వారికి స్థానం కల్పించారు. అందుకే దేశ వ్యాప్తంగా బీజేపీకి ఆదరణ పెరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి చేస్తా అని కెసిఆర్ మాట తప్పారని గుర్తు చేసారు. అనేక అంశాలు మానిఫెస్టోలో రాసుకొని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన వ్యక్తి కెసిఆర్ అంటూ తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వ హామీలు, వైఫల్యాల ను ఎండగట్టేందుకు మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా దేవరకద్ర వెళ్తున్నా అని అన్నారు.
read also: Elon Musk : మరోసారి రచ్చలేపిన ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు..
Also Read
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మాఆక్షన్ ప్లాన్ ఉంటుందని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎగరేది బీజేపీ జెండానే అంటూ హర్షం వ్యక్తం చేసారు. ఇప్పుడు రోజులు బాగా లేవు, 27 తరువాత బీజేపీలో చేరికలు ఉంటాయని తెలిపారు. తెరాస కాంగ్రెస్ పార్టీ వారు చాలామంది టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు ఈటెల. సీఎం మీద పోటీచేసుడే.. ఒడించుడే అంటూ సపథం చేసారు. దుర్మార్గ పాలన అంతం కావాలి అంటే.. ఎవరో ఒకరు కెసిఆర్ ను కొట్టాలి కదా అంటూ ఈటెల తెలిపారు. గజ్వేల్ లో నాకు తప్పకుండా ఆదరణ ఉంటుందని అన్నారు. కెసిఆర్ అహంకారానికి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మద్య పంచాయితీ అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్ ఎవరు కూడా కెసిఆర్ ను గుండెల్లో పెట్టుకొనే వారు లేరని, అందరి అభిమానాన్ని కోల్పోయారని విమర్శించారు. కాంగ్రెస్ ఢిల్లీ లో రాదు ఇక్కడ ఎడగదని ఎద్దేవ చేసారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే టీఆర్ఎస్ కి ఓటు వేసినట్టే అంటూ తీవ్ర విమర్శలు చేసారు. రాబోయే రోజుల్లో ఎవరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరినా వారిని ముందు ఉండి వాళ్ళను గెలిపిస్తా అన్నారు. హుజురాబాద్ ఫార్ములా ప్రకారం పనిచేస్తాఅంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. తిరుపతి కొండమీద కాంగ్రెస్ కి కెసిఆర్ ను ఎదుర్కొనే సత్తా లేదని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. ఆయన కెసిఆర్ మీద కసి తీర్చుకోవాలని చూస్తున్నారని, ఆ వేదిక బీజేపీ మాత్రమే అని ఆయన్ను ఆహ్వానిస్తున్నామని ఈటెల రాజేందర్ అన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?