Etala Rajender: కాళేశ్వరం అన్ని పిల్లర్ లను చెక్ చేస్తే తప్ప ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది తేలుతుందని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వారు చాలామంది టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు ఈటెల రాజేందర్. మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ జెండా ఎగురవేసి జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు ఈటల కు ఖడ్గం బహూకరించారు. పలువురికి ఈటల రాజేందర్ కాషాయ జెండా కప్పి బీజేపీ లోకి స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ ప్రజనికానికి శుభదినమన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఒక…