Etela Rajender: కవితకు కౌంటర్.. CPI, CPM లు కేసీఆర్ వదిలిన బాణాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చారు. కవిత చేసిన ట్వీట్ కు ఎమ్మల్యే ఈటెల స్పందించారు. షర్మిల తానా అంటే తందానా అని బీజేపీ నేతలు పరోక్షంగా ఆక్షేపించారు. వారు వదిలిన బాణం తానా అంటే తామర పువ్వులు అని ట్వీట్ చేసిన కవిత పై ఈటెల మండిపడ్డారు. షర్మిల బీజేపీ వదిలిన బాణమా? కాదా? అనేది పక్కన పెడితే ఆమెది ఒక పార్టీ అని అన్నారు. కవితకు ఇచ్చిన ట్వీట్‌కు CPI, CPM లు కేసీఆర్ వదిలిన బాణాలా? అంటూ ప్రశ్నించారు ఈటెల. ప్రజా స్వామ్యం లో నిరసనలు అన్ని పార్టీలు చేస్తాయని, ప్రభుత్వం అధ్వాన్నం గా దుర్మార్గం గా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇది ఎవరు చేసిన ఖండించల్సిందే అని స్పష్టం చేశారు. ప్రభుత్వం పోలీస్ లను అడ్డం పెట్టుకొని అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. పోలీస్ లను నమ్ముకున్న ఎవరు ముందు పడరని అన్నారు. 2021 22 ఆర్థిక సంవత్సరం కి 36 వేల కోట్లు వడ్డీ కడుతుందని అన్నారు. బడ్జెట్ రూప కల్పనలు అన్ని తప్పులున్నాయని అన్నారు.
read also: CM Jagan: జనంతోనే మాకు పొత్తు.. దుష్టచతుష్టయం దుష్ప్రచారాలు చేస్తోంది
Also Read
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
- Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
- KTR Injured: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. కేటీఆర్ నుదుటికి, చేతికి గాయం!
- MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
నీతి అయోగ్ సిఫార్సులు మాత్రమే చేస్తుంది. కానీ నీతి అయోగ్ చెప్పిందని ఆ డబ్బులు వస్తాయని బడ్జెట్ లో పెట్టిందని, కేంద్రాన్ని బద్నాం చేయడం తప్ప ఇది మరొకటి కాదని ఈటెల మండిపడ్డారు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేస్తేనే డబ్బులు వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. Gsdp ప్రకారం ఎంత అప్పు వస్తుందో అంత కన్న ఎక్కువ బడ్జెట్ లో పెట్టిందని అన్నారు. GSDP లో తెలంగాణ అప్పు 27.2 శాతం అని, FRBM పరిమితికి మించి అప్పు చేశారని తెలిపారు. లిక్కర్ ద్వారా ఈ ప్రభుత్వంకి 45 వేల కోట్ల అంచనా అన్నారు ఈటెల రాజేందర్. తెలంగాణకు వచ్చే సొంత ఆదాయం లో లిక్కర్ ద్వారానే ఎక్కువ అని ఆరోపించారు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ లకు తెలంగాణ ప్రభుత్వం తన వాటాను సకాలంలో కట్టక పోవడంతో లాప్స్ అవుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ వైఫల్యమే కారణం దీనికి కారణమని అన్నారు. ఇతర రాష్ట్రాలకు కేంద్రం సహకారం ఎలా ఉంటుందో తెలంగాణ కూడా అలానే చేస్తుందని ఈటెల అన్నారు. బట్ట కాల్చి మీద వేయడం కరెక్ట్ కాదని ఈటెల పేర్కొన్నారు. కేసీఆర్ డబ్బులు పంచే పని పెట్టుకున్నాడని, ఇదేమి గొప్ప కాదని సంక్షేమం ఉండాలని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల డబ్బుతోనే ఓట్లు కొనే నీచ సంస్కృతికి కేసీఆర్ దిగజారాడని ఆరోపించారు. ఆర్థిక పరిస్థితి పై హరీష్ రావుతో బహిరంగ చర్చకు సిద్దమని, ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తా అని ఈటెల సవాల్ విసిరారు.
Vikram Kirloskar: భారత్‌కు టయోటా తెచ్చిన విక్రమ్ కిర్లోస్కర్ హఠాన్మరణం
తాజావార్తలు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
Ameesha Patel: ‘ఆంటీ’ అంటూ ట్రోల్.. హార్దిక్‌తో లింకప్ రూమర్స్‌పై అమీషా స్ట్రాంగ్ కౌంటర్!
-
TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
-
Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!