Site icon NTV Telugu

Etela Rajender : ఈ సారి సీఎం కేసీఆర్‌కు ఓటు వేస్తే మన బతుకులు అగమే

Etela

Etela

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో రాష్ట్ర బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో గెలిచి తీరాలని ప్రధాని మోడీ సీరియస్ గా ఆలోచిస్తున్నారని, కాంగ్రెస్, బీఅర్ఎస్ పార్టీల నాయకులు పార్లమెంట్ లో చెట్ట పట్టాలు వేసుకొని తిరుగుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తిరిగి అది కేసిఆర్ కే వెళ్తుందని, తెలంగాణ కోసం 14 ఏళ్లు పోరాటం చేస్తే చిల్లర ఆరోపణ చేసి తనను బిఆరెఎస్ పార్టీ నుండి బయిటికి పంపారన్నారు. రాత్రి పగలు కష్టపడి తెలంగాణలో పార్టీని గెలిపించాలని వరంగల్ సభలో ప్రధాని మోడీ, జెపి నడ్డ చెప్పారు, సీఎం కేసీఆర్ ను గద్దె దించడమే తన కర్తవ్యమన్నారు ఈటల రాజేందర్‌.

Also Read : Renuka Chowdhury : దాదాపు 5 లక్షల డ్వాక్రా గ్రూపులను సైతం కేసీఆర్ మోసం చేశారు

కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా పంచని సీఎం కేసిఆర్ ఎం మొహం పెట్టుకొని గ్రామాల్లోకి వస్తాడని, బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఇంట్లో ఇద్దరు వృద్దులు ఉంటే వారిద్దరికీ పెన్షన్ లు ఇస్తామన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల పేరిట 25 వేల కోట్ల రూపాయలు మన చేతిలో పెట్టి, గల్లి గల్లీలో బెల్ట్ షాపులు నడుపుతూ సంవత్సరానికి 45 వేల కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద 8 కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ సారి సీఎం కేసిఆర్ కు ఓటు వేస్తే మన బతుకులు అగమేనని, ధనిక రాష్టం, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 లో రాష్ట్రంలోని రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తానన్న హామీ ఎందుకు నెరవేర్చలేదన్నారు.

Also Read : Renuka Chowdhury : దాదాపు 5 లక్షల డ్వాక్రా గ్రూపులను సైతం కేసీఆర్ మోసం చేశారు

Exit mobile version