ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. తాను ప్రాతినిథ్యం వహించిన హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రకు పూనుకున్నారు.. అయితే, అస్వస్థకు గురైన ఆయన.. ఆస్పత్రిలో చేరారు.. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ పాదయాత్ర కొనసాగిస్తారా? రద్దు చేసుకుంటారా? వాయిదా వేస్తారా? అనే చర్చ మొదలైంది.. వీటికి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు ఈటల రాజేందర్. 12 రోజులుగా 222 కిలోమీటర్లకు పైగా ప్రజా దీవెన పాదయాత్ర జరిగిందని.. ఈ యాత్రలో ప్రతిక్షణం నా…
హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. నేడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో ఆయన పర్యటించారు. మాట్లాడుతూ.. ‘నాలుగు రోజులుగా వర్షంలో తడుస్తున్నావు, ఎండుతున్నావు ఎందుకు బిడ్డ అని ప్రజలు అడుగుతున్నారని ఈటల చెప్పుకొచ్చారు. కేసీఆర్ డబ్బు, అధికారం, పోలీసుల ముందు నేను గెలువలేను. అందుకే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని మీ ముందుకు వచ్చాను అంటూ తెలిపారు. ఇక్కడికి వచ్చి నేను అంటే నేను…
మాజీమంత్రి ఈటల రాజేందర్ నేడు హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. అధికార టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. తెలంగాణను కేసీఆర్ రజాకార్ల రాజ్యం చేసిండన్నారు.. ‘దళిత బందు పథకం’ పెట్టారట సంతోషం.. కానీ ఇంతవరకు దళితులకు ఇస్తామన్న 3 ఎకరాలు అమలు కాలేదని, వారి సంక్షేమ కోసం ఏమీ చెయ్యలేదని ఆరోపించారు. కేవలం ఎన్నికల కోసం పథకాలు తీసుకురావద్దు.. రెండేళ్లుగా ఇవ్వని పెన్షన్, రేషన్ కార్డ్ ఇస్తున్నారు.…
తెలంగాణలో పాదయాత్ర సీజన్ వచ్చేస్తోంది.. కొత్తగా పీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తారని తెలుస్తుండగా… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే పాదయాత్ర తేదీని ప్రకటించారు.. మరోవైపు.. తాజాగా వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన వైఎస్ షర్మిల కూడా.. రేపోమాపో పాదయాత్ర షెడ్యూల్ విడుదల చేస్తారనే ప్రచారం సాగుతోంది.. ఇప్పుడు ఈ జాబితాలోకి మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా చేరారు.. తనపై అభియోగాలు…