కరీంనగర్ జిల్లా : బిజేపి నేత ఈటెల రాజేందర్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను అరిపోయే దీపం కాదని….తనను దించిన తర్వాత కేసీఆర్ కు తెలిసిందని తెలిపారు. తాను ఒక్కడినే మేధావిని, ఎదైన చేయ గలననే అహంకారం కేసీఆర్ కు ఉంటుందని ఫైర్ అయ్యారు. 2023లో బీజేపీ పార్టీ జెండా ఎగురబోతుందని.. కేసీఆర్ అహంకారం, డబ్బు, అధికారం మీద దెబ్బ కొట్టె ఎన్నిక ఇది అని మండిపడ్డారు. ప్రతి రెండు సంవత్సరాల ఒక సారి ఎన్నికలు వస్తున్నాయని… 2008, 2010లో రాజీనామా చేస్తే గొప్ప మెజారిటీతో హుజురాబాద్ ప్రజలు గెలిపించారని తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా… ధర్మానిదే గెలుపు అని తెలిపారు. 2018 ఎన్నికల్లో తాను ఓడిపోవాలని.. టీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేసిందని మండిపడ్డారు.