హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామంలో రైతు వేదిక ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను రానియలేదని.. దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కువగా వచ్చేవాన్ని అని పేర్కొన్నారు. కాళేశ్వరం వచ్చిన తరువాతనే నీళ్లు ఎక్కువగా వస్తున్నాయి.. నలబై ఏండ్ల నుంచి చూసిన.. ఇంత మంచి ముఖ్యమంత్రి కంటే ఎవ్వరిని చూడలేదని తెలిపారు. బయట వాళ్ళు ఎగేస్తే నీవు ఎగసిపోయావ్ ఏమైంది ఈటల ? అని ప్రశ్నించారు. ఈటల తీసుకున్న స్టెప్పులను తప్పు పడుతున్నానని వెల్లడించారు. కేసీఆర్ వచ్చినా తర్వాతనే 24 గంటల కరెంటు వస్తుందని పేర్కొన్నారు. కన్నతల్లి లాంటి టీఆరెస్ పార్టీకి మోసం చేసిన వారు ఎవరు పార్టీలో వుండరన్నారు. కమలాపూర్ మండలాన్ని ధర్మారెడ్డి ఆధ్వర్యంలో నేను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. టీఆరెస్ పార్టీ ఆనాడు టిక్కెట్ ఇచ్చింది కాబట్టి ప్రజలు ఈటలకు సపోర్ట్ చేశారని.. ఆనాడు ఈటల కాకుండా ఎవరికి టిక్కెట్ ఇచ్చిన ఇక్కడ వారే గెలిచేవారని పేర్కొన్నారు.