Errabelli Dayakar Rao: Errabelli Dayakar Rao: కాంగ్రెస్ మంత్రి పదవి ఆఫర్ చేసినా వెళ్లలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం జనరల్ కాబోతోందన్నారు. వర్థన్నపేటకు మళ్లీ నేనే వస్తా అంటూ ధీమా వ్యక్తం చేశారు. వర్థన్నపేట దయన్న అడ్డా… ఇకపై ఇక్కడే ఉంటా అన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు వందకోట్ల రూపాయల ఆఫర్ చేశారన్నారు. అయినా నేను పార్టీ మారలేదన్నారు. మంత్రి పదవి ఇస్తానన్నా కాంగ్రెస్ లోకి వెళ్లలేదన్నారు. చేసేది లేక నా వర్థన్నపేట నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వర్డ్ చేశారన్నారు. మొన్నటి ఎన్నికల్లో నా ప్రత్యర్థి ఎడ్వడంతో సెంటిమెంట్ తో ఆమెను గెలిపించారన్నారు.
Read also: Ponnam Prabhakar: ఎస్సీ , ఎస్టీ ల రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర..
అధికారంలో లేకపోయినా కార్యకర్తలను కాపాడుకున్న అన్నారు. ఇప్పుడు కూడా కార్యకర్తలపై ఈగవాలితే ఊరుకోనని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు మా కార్యకర్తల్లో ఒక్కరి జోలికి వచ్చినా వందమందిని ఉరికిస్తాం అన్నారు. కాంగ్రెస్ లీడర్లు బెదిరిస్తే భయపడం అన్నారు. మాకార్యకర్తల జోలికి వస్తే ఉరికిస్తారన్నారు. కేసీఆర్ నాకో పదవి ఇస్తానంటున్నారు… ఆలోచిస్తున్నా అన్నారు. కడియం శ్రీహరి మోసకారి అంటూ మండిపడ్డారు. చంద్రబాబును, కేసీఆర్ ను కూడా మోసం చేశాడన్నారు. కడియం శ్రీహరి విశ్వాసఘాతకుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఎప్పుడూ చంద్రబాబు, ఎన్టీఆర్ ను తిట్టలేదన్నారు.
Konda Surekha: సిద్దిపేటకు హరీష్ రావు అభివృద్ధి చేస్తే.. కేసీఆర్ ప్రచారమా?