Errabelli Dayakar Rao : హన్మకొండ జిల్లా అయినవోలు మండలం వెంకటాపురం గ్రామం నుండి స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రైతుల కోసం పాదయాత్రను ప్రారంభించారు. వెంకటాపురం నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర నష్కల్ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసలు పడుతున్నారు.
Bollywood : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన రూ. 581 కోట్లు వసూలు చేసిన సినిమా
దేవాదుల పనులు పూర్తి చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు” అని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “రేవంత్ రెడ్డికి అబద్ధాలు ఆడడం అలవాటు. కడియం శ్రీహరి చెప్పే మాటలన్నీ తుపాకి రాముని మాటల్లా ఉంటాయి. ఇద్దరూ తోడు దొంగలే. ఇద్దరూ నా వెంట తిరిగిన వాళ్లే, వాళ్ల గుణం, క్యారెక్టర్ నాకు బాగా తెలుసు” అని ఎర్రబెల్లి ఆరోపించారు.
తన రాజకీయ ప్రస్థానం గురించి ప్రస్తావిస్తూ.. “నేను ఏడు సార్లు గెలిచాను. మూడుసార్లు గెలిచినవాడు అబద్ధాలతో ముఖ్యమంత్రి అయ్యాడు. అమ్మాయి చేతిలో నేను ఓడిపోయానని కడియం శ్రీహరి ఎద్దేవా చేస్తున్నారు. నేను ఏడు సార్లు గెలిచాను, నువ్వు ఎన్నిసార్లు గెలిచావో, ఎన్నిసార్లు ఓడావో గుర్తు చేసుకో” అని ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు మంచి ఏదో, చెడు ఏదో బాగా అర్థమైందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత మరింత పెరుగుతుందని అన్నారు.
Allu Arjun: బ్యాక్ టు బ్యాక్ 3 అవార్డ్స్.. అల్లు అర్జున్ ఆసక్తికరమైన ట్వీట్
