Allu Arjun: బ్యాక్ టు బ్యాక్ 3 అవార్డ్స్.. అల్లు అర్జున్ ఆసక్తికరమైన ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు వినగానే స్టైల్, ఎనర్జీ, మాస్ అప్పీల్ గుర్తుకు వస్తాయి. గతంలో పుష్ప: ది రైజ్ తో నేషనల్ స్థాయిలో దుమ్ము రేపిన బన్నీ, ఇప్పుడు పుష్ప 2: ది రూల్ తో అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ 2025 (South Indian International Movie Awards)లో పుష్ప 2 ఘన విజయం సాధించింది. మొత్తం 11 నామినేషన్లలో 5 విభాగాల్లో అవార్డులు అందుకోవడం ద్వారా మరోసారి ఈ మూవీ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో రుజువైంది. అందులో ముఖ్యంగా బెస్ట్ యాక్టర్ అవార్డుని అల్లు అర్జున్ గెలుచుకోవడం అభిమానులకు గర్వకారణంగా మారింది.
Also Read : Samantha: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత అవేర్ నెస్ వీడియో..
Also Read
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
- Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
కాగా ఈ విజయం పై అల్లు అర్జున్ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.. “ఈ అవార్డులన్నీ నా టీమ్ కృషి వల్లే సాధ్యమయ్యాయి. సుకుమార్ గారు, మొత్తం పుష్ప ఫ్యామిలీకి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా నాకు నిరంతరం అండగా నిలిచే నా అభిమానులకి ఈ అవార్డులను అంకితం చేస్తున్నాను” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఇక వరుసగా మూడు సైమా బెస్ట్ యాక్టర్ అవార్డులను గెలుచుకోవడం బన్నీ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. గతంలో అల వైకుంఠపురములో, పుష్ప: ది రైజ్ కు అవార్డు గెలిచిన బన్నీ, ఇప్పుడు పుష్ప 2: ది రూల్ తో హ్యాట్రిక్ కొట్టేశారు. దీంతో బన్నీ పోస్ట్ చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ఫుల్ జోష్‌లో రిప్లైలు ఇస్తున్నారు. “ఐకాన్ స్టార్ కి ఇది సరిపోదు, ఇంకా ఎన్నో అవార్డులు రావాలి”, “నువ్వు గెలిచేది అవార్డులు కాదు, మన హృదయాలు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Thank you SIIMA, Thank you Dubai. 🖤#TeamAA pic.twitter.com/x3gRV6SMTc
— Allu Arjun (@alluarjun) September 7, 2025
తాజావార్తలు
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?