Errabelli Dayakar Rao : హన్మకొండలో రైతుల కోసం పాదయాత్ర.. ఎర్రబెల్లి హాట్ కామెంట్స్
- వెంకటాపురం నుండి నష్కల్ వరకు రైతుల పాదయాత్ర ప్రారంభం
- దేవాదుల పనులు పూర్తి అయ్యే వరకు కాంగ్రెస్‌ను వదలమన్న ఎర్రబెల్లి
- రేవంత్ రెడ్డి, కడియం శ్రీహరి పై తీవ్ర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Errabelli Dayakar Rao : హన్మకొండ జిల్లా అయినవోలు మండలం వెంకటాపురం గ్రామం నుండి స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రైతుల కోసం పాదయాత్రను ప్రారంభించారు. వెంకటాపురం నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర నష్కల్ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసలు పడుతున్నారు.
Bollywood : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన రూ. 581 కోట్లు వసూలు చేసిన సినిమా
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. రూ.351 పెంపు..
- Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
దేవాదుల పనులు పూర్తి చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు” అని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “రేవంత్ రెడ్డికి అబద్ధాలు ఆడడం అలవాటు. కడియం శ్రీహరి చెప్పే మాటలన్నీ తుపాకి రాముని మాటల్లా ఉంటాయి. ఇద్దరూ తోడు దొంగలే. ఇద్దరూ నా వెంట తిరిగిన వాళ్లే, వాళ్ల గుణం, క్యారెక్టర్ నాకు బాగా తెలుసు” అని ఎర్రబెల్లి ఆరోపించారు.
తన రాజకీయ ప్రస్థానం గురించి ప్రస్తావిస్తూ.. “నేను ఏడు సార్లు గెలిచాను. మూడుసార్లు గెలిచినవాడు అబద్ధాలతో ముఖ్యమంత్రి అయ్యాడు. అమ్మాయి చేతిలో నేను ఓడిపోయానని కడియం శ్రీహరి ఎద్దేవా చేస్తున్నారు. నేను ఏడు సార్లు గెలిచాను, నువ్వు ఎన్నిసార్లు గెలిచావో, ఎన్నిసార్లు ఓడావో గుర్తు చేసుకో” అని ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు మంచి ఏదో, చెడు ఏదో బాగా అర్థమైందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత మరింత పెరుగుతుందని అన్నారు.
Allu Arjun: బ్యాక్ టు బ్యాక్ 3 అవార్డ్స్.. అల్లు అర్జున్ ఆసక్తికరమైన ట్వీట్
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకరండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
-
Donald Trump: “నీకు పిచ్చి పట్టింది, నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి” నెతన్యాహుపై ట్రంప్ ఫైర్
-
Italy Earthquake: ఇటలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!