Chikoti Casino Case: కేసినో కేసు.. నేడు ఈడీ ముందుకు హాజరైన MLC ఎల్ రమణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED forward MLC L. Ramana: తెలంగాణలో ‘చీకోటి’ క్యాసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. దీంతో.. ఈడీ విచారణ రాజకీయ వేడిని పెంచుతోంది. విదేశాల్లో క్యాసినో అక్రమ నిర్వహణ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో నోటీసులు అందుకున్న నేతల్లో వణుకు మొదలైంది. ఇవాళ కేసినో కేసులో ఈడీ ముందు MLC ఎల్ రమణ విచారణకు హాజరయ్యారు. విదేశీ టూర్స్, బ్యాంకు లావాదేవీలతో ఎల్ రమణ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ ముగిసాక వివరంగా మాట్లాడతా అని ఎల్.రమణ తెలిపారు.
Read also:GVL Narasimha Rao: లిక్కర్ స్కాంలో విజయవాడనుంచి డబ్బులు తరలింపు
Also Read
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- Off The Record : డెలివరీ సూపర్.. ప్రచారం వీక్! కాంగ్రెస్ మార్క్ పాలన ప్రజల్లోకి వెళ్లడం లేదా?
- Off The Record : సొంత ప్రభుత్వమైనా తగ్గేదే లే.. దొంతి మాధవరెడ్డి రూటే సెపరేటు!
ఇప్పటికే బుధవారం మంత్రి తలసాని సోదరులైన మహేష్, ధర్మేంద్రలను దాదాపు 10గంటల పాటు ఈడీ విచారించింది. క్యాసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలు, మనీలాండరింగ్, హవాలా చెల్లింపులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. శుక్రవారం వీళ్లిద్దరినీ మరోసారి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ వైద్యులు అంకాలజిస్ట్ వంశీకి విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు పంపించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గురునాథ్ రెడ్డికి సైతం ఈడీ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఎమ్మెల్సీ ఎల్.రమణ, మెదక్ డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు పంపింది. హవాలా చెల్లింపులు, మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ విచారణ జరుపుతోంది. ఇప్పటికే చీకోటి ప్రవీణ్ ను గతంలో నాలుగు రోజులపాటు ఈడీ విచారించింది. గురువారం, నేడు(శుక్రవారం) విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక క్యాసినో వ్యవహారంలో ప్రవీణ్ కుమార్‌తో సంబంధాలున్న పలువురిని ఈడీ విచారిస్తోంది. క్యాసినో కేసులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయవేత్తలకు ప్రమేయం ఉందని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు భావిస్తున్నారు. అనుమానం ఉన్న వారికి చెందిన నాలుగేళ్ల ఆర్థికలావాదేవీలపై ఆరా తీస్తున్నారు. దీంతో చీకోటి ప్రవీణ్‌తో సంబంధాలు ఉన్న రాజకీయ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇక వచ్చేవారం ఈడీ ముందుకు మంత్రి తలసాని పీఏ హరీష్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Tiger in Asifabad: కాగజ్‌నగర్‌లో పెద్దపులి కలకలం.. రోడ్డు దాటుతుండగా..
తాజావార్తలు
-
Karuppu : కరుప్పు బ్లాక్ బస్టర్.. భారీ ధర పలుకుతున్న సూర్య తెలుగు సినిమా థియేట్రికల్ రైట్స్..
-
RCB vs GT Qualifier 1: విరాట్ కోహ్లీ పార్ట్నర్ మారనున్నాడా?.. ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ కీలక వ్యాఖ్యలు!
-
Minister Narayana: అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం.. మంత్రి నారాయణ ఫైర్
-
Karuppu Success Meet: ‘కరుప్పు 2’పై సూర్య బిగ్ హింట్..
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?