Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మరో 7 రోజుల్లో ఓటింగ్ జరగనున్నందున అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అయితే.. అదే సమయంలో ప్రలోభాలపర్వానికి తెరలేపారు.కాగా.. ఇప్పటికే పెద్ద మొత్తంలో నగదు యజమానులకు డబ్బులు చేరినట్లు తెలిసింది. అయితే తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా కనిపిస్తోంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వినియోగించిన డబ్బు, మద్యం, డ్రగ్స్ తదితర వస్తువులను ఎన్నికల అధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 10వ తేదీ నుంచి కోడ్ అమల్లోకి రావడంతో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎన్నికల అధికారులు, పోలీసులతో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఈ నెల 20వ తేదీ వరకు ఐదు రాష్ట్రాల్లో రూ.1,760 కోట్ల ఆస్తులను సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Read also: Revanth Reddy: మహబూబ్ నగర్ లో రేవంత్ రెడ్డి పర్యటన.. వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేటలో ప్రచారం
ఐదు రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధికంగా ఆస్తులు జప్తు అయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు రూ.659.2 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు. ఐదు రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రమైన రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. అక్కడ రూ.650.7 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు. ఐదు రాష్ట్రాల్లో రూ.372.9 కోట్ల నగదు పట్టుబడగా, అందులో 60 శాతం అంటే రూ.225.23 కోట్లు తెలంగాణలో పట్టుబడ్డాయి. స్వాధీనం చేసుకున్న మిగిలిన ఆస్తుల్లో మద్యం, డ్రగ్స్, విలువైన వస్తువులు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో 323.7 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 7.69 కోట్లు, మిజోరంలో అత్యల్పంగా 49.6 కోట్లు. తెలంగాణలో మరో 9 రోజుల్లో పోలింగ్ జరగనుంది. ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రలోభాల దశ ఇప్పటి నుండి ప్రారంభమవుతుంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా భారీగా నగదు పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. నియోజక వర్గాల్లోని సాధారణ కార్యకర్తలతో పాటు ప్రధాన అనుచరుల ఇళ్లలోకి కూడా అనుమానం రాకుండా భారీగా డబ్బులు గుంజుతున్నట్లు సమాచారం. ఎన్నికలకు రెండు రోజుల ముందు ఓటర్లకు డబ్బులు పంచేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి అభ్యర్థులు స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని తెలియజేసారు. ఏది ఏమైనా ఓట్లు కొని ఓట్లు అమ్ముకోవడం ప్రజాస్వామ్యంలో సరికాదు.
Revanth Reddy: మహబూబ్ నగర్ లో రేవంత్ రెడ్డి పర్యటన.. వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేటలో ప్రచారం