Revanth Reddy: మహబూబ్ నగర్ లో రేవంత్ రెడ్డి పర్యటన.. వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేటలో ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: మహబూబ్ నగర్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేటలో ఎన్నికల ప్రచారం పాల్గొననున్నారు. నేడు మూడు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు వనపర్తి లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభ లో ప్రసంగించి అనంతరం మధ్యాహ్నాం 2 గంటలకు నాగర్ కర్నూల్ చేరుకుంటారు. అనంతరం అక్కడి ఏర్పాటు చేసిని సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు అచ్చంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
ఖైరతాబాద్ లో నిన్న రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే.. ఖైరతాబాద్ అంటే గుర్తొచ్చేది ఇద్దరే ఇద్దరని.. ఒకరు ఖైరతబాద్ గణేశుడు, ఇంకొకరు పీ.జనార్దన్ రెడ్డి అని అన్నారు. పీజేఆర్ మన మధ్య లేకపోయినా పేదల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. 20ఏళ్ల తరువాత పేజేఆర్ కుటుంబానికి ఓటు వేసే అవకాశం ఖైరతాబాద్ ప్రజలకు వచ్చిందన్నారు. విజయమ్మకు ఓటు వేస్తే రేవంత్ రెడ్డికి ఓటు వేసినట్టేనని, పీజేఆర్ హయాంలోనే మీకు ఇండ్లు వచ్చినయ్, కరెంటు వచ్చింది.. అభివృద్ధి జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. దానం నాగేందర్ సగం హైదరాబాద్ ను ఆక్రమించుకున్నాడు కానీ.. బస్తీల్లో పేదలకు చేసిందేం లేదన్నారు. బీజేపీ చింతల రాంచంద్రా రెడ్డి మీకు కొత్త కాదు.. పాత చింతకాయ పచ్చడేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పీజేఆర్ బిడ్డ విజయమ్మకు ఒక్క అవకాశం ఇవ్వండి.. ఈ ఆడబిడ్డను గెలిపిస్తే మీ ఇంట్లో మీ ఆత్మగౌరవం నిలబడుతుంది. విజయమ్మను గెలిపిస్తే పీజేఆర్ పేరు నిలబెడుతుంది.. మీ కోసం కొట్లాడుతుంది. పంజాగుట్ట చౌరస్తాలో దివాన్ జీ దగ్గర బీడీలు అమ్ముకునే దానంను ఎమ్మెల్యేను, మంత్రిని చేసింది కాంగ్రెస్. అలాంటి నువ్వు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తావా? అన్నం పెట్టిన కాంగ్రెస్ కు సున్నం పెట్టడం న్యాయమేనా నాగేందర్.. ఇలాంటి దానంను ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు.
Salaar: రికార్డ్స్ లో కొత్త హిస్టరీ క్రియేట్ అవుతుంది…
తాజావార్తలు
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!