Tragedy: తండ్రి తెచ్చిన చాక్లెట్ చిన్నారి ప్రాణం తీసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: తండ్రి తన గారాల బిడ్డకోసం ఎంతో ఇష్టంతో విదేశాల నుంచి తెచ్చిన చాక్లెట్ తన బిడ్డ ప్రాణాలే బలి గొంటుందని ఊహించలేక పోయాడు. నాన్న తెచ్చిన చాక్లెట్ లను తీసుకుని చిన్నారి స్కూల్ లో తిండామనుకున్నాడు. కానీ ఆ చాక్లెట్ బాలుడికి శాపంగా మరింది. అది తిన్న ఆ చిన్నారికి ఊపిరి ఆడలేదు. కాసేపు నరకయాతన అనుభవించాడు. చివరకు ప్రాణాలు వదిలాడు. విగత జీవిగా మిగిలాడు. ఈ ఘటన వరంగల్ పట్టణంలోని పిన్నవారి వీధిలో చోటుచేసుకుంది.
Read also: Bird Flu: అమెరికాలో ఏవియన్ ఫ్లూ విలయం… ఐదు కోట్ల కోళ్లు బలి
Also Read
- Medico Priyanka : కిమ్స్‌లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన కన్‌గహాన్‌సింగ్ 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు వలస వచ్చి జేపీఎన్ రోడ్లో ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. తనకు భార్య గీత, ముగ్గురు కుమారులు.. కుమార్తెతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకు లైన్లో నివాసం ఉంటున్నాడు. ఇక.. వ్యాపార పనుల్లో భాగంగా కన్‌గహాన్ ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడి నుంచి వస్తూ తన చిన్నారుల కోసం అక్కడి నుంచి చాక్లెట్లు తెచ్చాడు. ఇక.. కన్‌గహాన్ రెండో కుమారుడు ఎనిమిదేళ్ల సందీప్ వరంగల్ పిన్నావారి వీధిలోని శారదా పబ్లిక్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. తనకి అన్న, సోదరి కూడా ఇదే స్కూల్ విద్యార్థులు. కన్‌గహాన్‌సింగ్ పిల్లలను బైక్‌పై స్కూల్‌కి తీసుకెళ్లేముందు తల్లి వాళ్లకు చాక్లెట్లు ఇచ్చింది. తండ్రి తెచ్చిన చాక్లెట్లను తింటూనే పిల్లలు బైక్ ఎక్కారు. చాక్లెట్ నోట్లోనే పెట్టుకుని పాఠశాల మొదటి అంతస్తులోని క్లాస్ రూంకి వెళ్లిన సందీప్ కాసేపటికే స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులకు పాఠశాల యాజమాన్యం సమాచారం అందించడంతో కన్‌గహాన్‌సింగ్ హుటాహుటిన వచ్చి ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు సందీప్ గొంతులో చాక్లెట్ ఇరుక్కున్నట్లు గుర్తించారు. చికిత్స అందిస్తుండగానే సందీప్ ఊపిరాడక చనిపోయాడు. నిన్న (శనివారం) సాయంత్రం సందీప్ అంత్యక్రియలు నిర్వహించారు. సందీప్ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తండ్రి ప్రేమతో తెచ్చిన చాక్లెట్ అప్పుడే తన ముందు ఆడుకుంటూ బాయ్ బాయ్ అమ్మ అంటూ వెళ్లిన తన కన్న కొడుకు తిరిగి రాని లోకానికి వెళ్లిపోవడంతో ఆ కుటుంబం తీరని శోకాన్ని మిగిల్చింది. తన కొడుకును తలచుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు తల్లిదండ్రులు.
Students Fell ill: రెండు పాఠశాలల్లో 50 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఏం జరిగిందంటే?
తాజావార్తలు
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్‌తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్‌తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్
-
Jharkhand: జార్ఖండ్‌లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!