సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో ఇవాళ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా టీఆర్ ఎస్ పార్టీ పై నిప్పులు చెరిగారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతోకాలం ఉండదని గ్రహించుకోవాలని.. ఇక నీ కాలం చెల్లదు గుర్తుంచుకో అంటూ సీఎం కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. పూర్తి స్థాయి పరిహారం అందించే వరకు రైతుల పక్షాన బిజెపి అండగా ఉంటుందని… ఇల్లు లేని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు.
18 సంవత్సరాలు నిండిన యువకులకు 8 లక్షల పరిహారం చెల్లించాలని.. వ్యవసాయ భూముల అభివృద్ధి కోసం ప్రభుత్వం రైతులకు డబ్బులు చెల్లించాలని పేర్కొన్నారు ఈటల రాజేందర్.
లక్షలాది మందికి అవకాశం కల్పించే గూడటిపల్లి ప్రజలు న్యాయమైన డిమాండ్ల కోసం డిమాండ్ చేస్తే పోలీసులతో దౌర్జన్యం చేస్తూ రక్తపాతం సృష్టించడం దుర్మార్గం మైన చర్య అని ఆగ్రహించారు.