Sheep Scam: సంగారెడ్డిలో గల్లంతు అయిన గొర్రెల పంపిణీ పథకం డేటా..?
- సంగారెడ్డి జిల్లాలో గల్లంతు అయిన గొర్రెల పంపిణీ పథకం డేటా..?
- కార్యాలయంలో కంప్యూటర్ డేటా బ్లాక్ కావడంతో వెలుగులోకి
- గత 10 రోజులుగా సెలవులో అధికారి వసంత కుమారి
- కరోనాతో రెండున్నరేళ్ల క్రితం మృతి చెందిన కార్యాలయ ఉద్యోగి
- ఈ నెలాఖరు వరకు పూర్తి సమాచారం ఇస్తామంటున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheep Scam: గొర్రెల పంపిణీ స్కాం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఈ కుంభకోణంపై దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. కాగా సంగారెడ్డిలో గొర్రెల పంపిణీ పథకం డేటా గల్లంతు కావడం అధికారులకు షాక్ కు గురిచేసింది. కార్యాలయంలో కంప్యూటర్ డేటా బ్లాక్ కావడం, హార్డ్ డిస్క్ స్ట్రక్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గత 10 రోజులుగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంత కుమారి సెలవులో ఉండటం గమనార్హం. కరోనాతో రెండున్నరేళ్ల క్రితం కార్యాలయ ఉద్యోగి మృతి చెందింది. దీంతో ఉద్యోగి చనిపోవడంతోనే గత రెండున్నరేళ్లుగా డేటా అంతా స్ట్రక్ అయి ఉందని అధికారులు చెబుతున్నారు. రెండున్నరేళ్లు అయినా డేటా రికవరీ చేయకపోవడంతో అధికారుల తీరుపై పెరుగుతున్న అనుమానాలు. మాన్యువల్ గా డేటాను సేకరిస్తున్నామంటున్న పశుసంవర్ధక శాఖ అధికారులు. ఈ నెలాఖరు వరకు విజిలెన్స్ అధికారులకి పూర్తి సమాచారం ఇస్తామంటున్నారు.
Also Read
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
కాగా, గొర్రెల పంపిణీపై ఇప్పటికే ఈడీ అధికారులు పశుసంవర్ధక శాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. 10 అంశాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని లేఖలో కోరారు. దీంతోపాటు గొర్రెల పంపిణీ స్కాంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కుంభకోణానికి సంబంధించిన వివరాలను కోరింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీలో రూ.1000 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మోసానికి సంబంధించి ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, గొర్రెల పంపిణీలో భాగంగా మనీలాండరింగ్‌పై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు తదితర వివరాలను ఈడి కోరింది. గొర్రెల కొనుగోలుకు సంబంధించి సమాఖ్య ప్రభుత్వ ఖాతాల్లో ఏ జిల్లా అధికారులు జమ చేశారనే వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ అయిన నిధులు, ఏ ఖాతాల్లో జమ చేశారు? గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి చెల్లించిన చెల్లింపుల వివరాలు, గొర్రెల కోసం కొనుగోలు చేసిన మేత, ఏ లబ్ధిదారులకు పంపించారు? దీని కోసం ఎవరెవరికి నిధులు మంజూరయ్యాయనే వివరాల కోసం ఈడీ కోరింది.
Kuwait Fire Tragedy: కువైట్ అగ్నిప్రమాద మృతుల్లో ఏపీకి చెందిన ముగ్గురు.. ఇద్దరు పెరవలి వాసులే..!
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!