eatal-rajender-suspended-from-asembly-this-session మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మూడో రోజు శాసనసభలో కీలకమైన బిల్లులతో పాటు కేంద్రానికి సంబంధించిన రెండు అంశాలపై చర్చలు జరగనున్న నేపథ్యంలో.. అసెంబ్లీ నుంచి ఈటెల రాజేందర్ సస్పెండ్ అయ్యారు. శాసన సభలో సెప్టెంబర్ 6న మొదలైన విషయం తెలిసిందే.. అయితే ఈటెల మాట్లాడుతూ.. తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై మాజీమంత్రి , బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. స్పీకర్ ను మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈటెల వ్యాఖ్యల పై ఇవాళ శాసనసభలో ఈటెల.. స్పీకర్ కు క్షమాపణ చెప్పకపోవడంతో.. స్పీకర్ , ఈటెలను శాసన సభనుంచి సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసే వరకు ఈటల రాజేందర్‌పై సస్పెన్షన్ వేటు వేసారు స్పీకర్.
read also: Little Horse Run For Mother Horse : తప్పిపోయిన పిల్ల గుర్రం.. తల్లి కోసం ఆరాటం..
సభ నుంచి వెలుపలికి వచ్చిన ఈటెల.. తన వాహనంలో వెళ్తున్న సమయంలో.. ఈటలను పోలీసులు అడ్డుకున్నారు. తనను అరెస్ట్ చేస్తున్నారా అంటూ పోలీసులను ప్రశ్నించారు ఈటల. పోలీసుల తీరుతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్. బానిసలా వ్యవహరించవద్దంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడాదిగా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. నేను గెలిచినప్పటి నుంచి అసెంబ్లీకి హాజరుకాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను గద్దె దించే వరకు విశ్రమించనని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
SSMB29: ఎట్టకేలకు మహేశ్ సినిమాపై అప్డేట్ ఇచ్చిన జక్కన్న.. అంతకుమించి