ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కదా..! అంటారు.. అంటే.. ఎవరు ఏ స్థానంలోకి వెళ్లినా.. తల్లికి ఉన్న ప్రాధాన్యత మాత్రం తగ్గదు.. ఇక, తప్పిపోయినవారి పరిస్థితి దారుణంగా ఉంటుంది.. తల్లికోసం వారుపడే ఆరాటం.. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఎన్నో ఘటనలు ఎదురవుతూనే ఉంటాయి.. ఇది కేవలం మనుషుల వరకే పరిమితం కాదు.. జీవం ఉన్న ఏ ప్రాణిలోనైనా.. తల్లి బిడ్డల ప్రేమలు ప్రత్యేకంగా కనిపిస్తాయి.. తల్లి తప్పిపోతే బిడ్డ పడే ఆరాటం.. బిడ్డ కనిపించకుండా ఉంటే.. తల్లి తల్లడిల్లే దృశ్యాలు ఎన్నో కళ్ల ముందు మెదులుతూనే ఉంటాయి.. తాజాగా తల్లి నుంచి తప్పిపోయిన ఓ పిల్ల గుర్రం.. పోస్టర్‌లో ఉన్న ఓ గుర్రం బొమ్మను చూసి.. అదే తన తల్లిగా భావించి అల్లాడిపోయింది.. బస్సు ఆగి ఉన్నంత సేపు.. అక్కడే తచ్చాడిన ఆ పిల్ల గుర్రం.. బస్సు వెళ్లిపోతుంటూ.. దాని పక్కనే చాలా దూరం పరిగెత్తడం ఎంతో మంది కదలించింది..
Read Also: Artemis-1: ఆర్టెమిస్-1 ప్రయోగానికి సిద్ధమైన నాసా.. అప్పుడేనా..?
తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానిక బత్తిశ్వర ఆలయం సమీపం నుంచి గత వారం రోజుల క్రితం.. తల్లి గుర్రం తప్పిపోయింది గుర్రం పిల్ల.. అప్పటి నుంచి తన తల్లి కోసం వెతుకుతూనే ఉంది.. అయితే, తాజాగా, పేరూరు బస్ స్టేషన్ దగ్గర ఓ ప్రైవేట్ బస్సుపై.. తల్లి గుర్రంలాగే ఓ స్టిక్కర్ అంటించింది ఉంది.. అదే తన తల్లిగా భావించిన ఆ పిల్ల గుర్రం.. ఆ పోస్టర్‌ను చూస్తూ.. అక్కడే ఉండిపోయింది.. ఇక, కాసేపటి తర్వాత బస్సు అక్కడి నుంచి కదిలింది.. దీంతో.. బస్సుపై ఉన్న మరో గుర్రం స్టిక్కర్‌ను చూస్తూ బస్సు వెంటే పరుగులు పెట్టింది.. దాదాపు మూడు కిలోమీటర్ల మేర పరుగులు తీసింది… బస్సు పై ఉండే స్టిక్కర్ పక్కన పరుగెత్తుకుంటూ ఓ పిల్ల గుర్రం వెళ్లిన దృష్యాలు చూసి చలించిపోయారు స్థానికులు.. మొత్తంగా తల్లి కోసం తల్లడిల్తుతూ.. పిల్ల గుర్రం పెట్టిన పరుగులు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి..