శంషాబాద్ లో ఒ వ్యక్తి తన ఇంట్లో ఏకంగా గంజాయి మొక్కలను పెంచాడు. పెంచిన గంజాయి విక్రయిస్తాడా? అతనే సేవిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఉట్పల్లి గ్రామంలో ఒ వ్యక్తి తన ఇంట్లో రెండు గంజాయి మొక్కలు పెంచాడు.
తమిళనాడులో వెలుగులోకి వచ్చిన ఒక డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. నిజానికి, శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ అనే నటుడు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తేలడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడి ద్వారా కొంత సమాచారం తెలియడంతో, ఈ కేసులో కృష్ణ అనే మరో నటుడిని కూడా ఈ రోజు ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు కూడా డ్రగ్స్ వాడినట్లు ముందు నుంచి ప్రచారం జరిగింది. Also Read: Raashi Khanna : టాప్…
జైలులోనే డ్రగ్స్ దందాకు స్కెచ్ వేశారు. యస్.. మీరు విన్నది కరెక్టే. ఇద్దరు నైజీరియన్లు.. ముగ్గురు ఇండియన్స్ కలిసి డ్రగ్స్ దందాకు ప్లాన్ చేశారు. అంతే కాదు..జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ ప్లాన్ అమలు చేశారు. కొన్నాళ్లు బాగానే నడిచినా.. మళ్లీ అందరినీ కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. డ్రగ్స్ పేరు చెబితే అందులో కచ్చితంగా నైజీరియన్స్ పాత్ర.హైదరాబాద్‌లో డ్రగ్స్ పేరు చెబితే అందులో కచ్చితంగా నైజీరియన్స్ పాత్ర ఉంటుంది. జైలులో ఒక్కటైన బిషప్, రోనాల్డ్…
హైదరాబాద్‌లో డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి? అని ఎవరైనా అడిగితే పబ్స్‌లో దొరుకుతాయని ఈజీగా సమాధానం చెప్పవచ్చు. అంతలా డ్రగ్స్ దందా అక్కడ నడుస్తోంది. ఏకంగా కొంత మంది డీజేలే పెడ్లర్ల అవతారం ఎత్తి వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా పబ్బులు.హైదరాబాద్‌లో పబ్బులు.. డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి.. పబ్బుల తీరు మారడం లేదనే విమర్శలు. ఒక్కసారి రెండుసార్లు కాదు.. పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసినా.. డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. అంతే కాదు డ్రగ్స్…
మంగ్లీ బర్త్ డే పార్టీ వివాదంగా మారింది. స్నేహితులు, బంధువుల మధ్య ఉల్లాసంగా జరుపుకోవాలనుకున్న బర్త్ డే పార్టీ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించడం, లిక్కర్ సరఫరా చేయడం, గంజాయి తాగిన వ్యక్తి పట్టుబడటంతో కేసు నమోదు వరకు వెళ్ళింది. సరిగా బర్త్ డే రోజే చేవెళ్ల పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ పై కేసు నమోదు అయింది. త్రిపుర రిసార్ట్స్ లో విపరీతమైన సౌండ్ పొల్యూషన్ తో పార్టీ…
అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న రిసార్ట్ పై చేవెళ్ల పోలీసులు దాడి చేసినట్లు పోలీసులు ప్రకటించారు. చట్టాలు పాటించకుండా ఎలా పడితే అలా వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే పోలీసులు ఝులిపించి గాడినపెట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఎంతటి ప్రముఖులైనా, ఎవరు ఎంతటివారైనా, చట్టాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలని వాడే వారి పట్ల అత్యంత కఠిన చర్యలు తీసుకోవడానికి ఎట్టిపరిస్థితుల్లో వెనుకాడం అంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు. Also Read:Jr NTR : బన్నీ మిస్సైన కథతో జూనియర్ ఎన్టీఆర్..…
చేవెళ్ల త్రిపుర రిసార్టులో మంగ్లీ పుట్టిన రోజు వేడుకలపై కేసు నమోదు చేసారు పోలీసులు. ఈ అంశంలో మొత్తం నలుగురిపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడం, పర్మిషన్ లేకుండా మద్యం వాడకంపై కేసులు నమోదయ్యాయి.. మంగ్లీతో పాటు రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్, దామోదర్ రెడ్డిలపై కేసు పెట్టారు. Also Read : Balakrishna : రీల్ తగలబెట్టేస్తా.. దర్శకుడికి వార్నింగ్ ఇచ్చిన బాలయ్య.. ! ఇక ఈ…
Delhi Airport: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. విదేశీ మూలాలు కలిగిన ఈ డ్రగ్స్ థాయిలాండ్ నుంచి అక్రమంగా దేశంలోకి తరలించడానికి ప్రయత్నించగా, అధికారులు అప్రమత్తతో దీన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 63 కోట్ల రూపాయల విలువ చేసే 60 కేజీల గంజాయిను సీజ్ చేశారు. గంజాయిని లగేజ్ బ్యాగ్ లో అత్యంత చాకచక్యంగా దాచిన స్మగ్గలర్స్, దాన్ని సాధారణ ప్రయాణికుల లగేజ్ లాగా పంపించేందుకు యత్నించారు. Read Also:…
Delhi Airport: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి పెద్ద ఎత్తున అక్రమ రవాణాను గుర్తించి స్మగ్లర్ల కుట్రను భగ్నం చేశారు. ఈ ఘటనలో మొత్తం 27 కోట్ల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణా వ్యవహారంలో థాయ్‌లాండ్‌కు చెందిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. స్మగ్లర్లు విదేశీ గంజాయిని చాకచక్యంగా 54 ప్యాకెట్లుగా ప్యాకింగ్ చేసి లగేజ్ బ్యాగ్‌లలో దాచిపెట్టారు. బట్టల తరలింపుగా చూపిస్తూ.. నాలుగు ట్రాలీ బ్యాగ్‌లను పూర్తిగా…
Drugs Seized: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి భారీగా ఫారిన్ గంజాయి సీజ్ చేశారు. బ్యాంకాక్ నుండి ఢిల్లీకి వచ్చిన ఐదుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ. 47 కోట్ల రూపాయల విలువైన ఫారిన్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. స్మగ్లర్లు బాగా ప్రణాళికాబద్ధంగా 5 ట్రాలీ బ్యాగ్‌లలో లగేజ్ స్థానంలో గంజాయిని నింపారు. ఆ తర్వాత గంజాయితో కూడిన బ్యాగ్‌లను గ్రీన్ చానెల్ ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం…