Dubbaka Band: కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం.. నేడు దుబ్బాక బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dubbaka Band: సిద్దిపేట జిల్లాలో దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఆందోళనకు పిలుపునిచ్చారు. హత్యాయత్నానికి పాల్పడిన రాజకీయ నాయకులపై, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నారు. దుబ్బాక, దౌల్తాబాద్, రాయపోల్, మిరుదొడ్డి, తొగుట, చేగుంట, నార్సింగి, అక్బర్పేట-భూంపల్లి మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నారు. దుబ్బాకలో రఘునందన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. హత్యాయత్నానికి నిరసనగా బీఆర్ఎస్ నాయకులు మంగళవారం దుబ్బాక నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చారు.
మండల కేంద్రాలు, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మంగళవారం ఉదయం 11 గంటలకు నల్లజెండాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులు పెద్దఎత్తున నాయకులు పిలుపునిచ్చారు. కాగా, కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించేందుకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ ఎస్ నాయకులు ఆస్పత్రికి తరలివచ్చారు. బీజేపీ, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు వ్యతిరేకంగా దవాఖాన ఆవరణలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బీజేపీ డౌన్ డౌన్.. ఎమ్మెల్యే రఘునందన్ రావు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Also Read
కత్తిపోట్లకు గురైన మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యులను అడిగి ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్‌రెడ్డికి డాక్టర్లు సుమారు నాలుగు గంటల పాటు కష్టపడి సర్జరీ చేశారు. చిన్న ప్రేగుకు నాలుగు చోట్ల గాయాలు కావడంతో, పది సెంటీమీటర్ల మేర చిన్నపేగును తొలగించినట్లు యశోదా ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. గ్రీన్ ఛానెల్‌తో హైదరాబాద్‌కు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని తరలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేదని యశోదా హస్పటల్ వైద్యులు పేర్కొన్నారు. రక్తం కడుపులో పేరుకుపోయిందని వారు తెలిపారు. ప్రేగుకు నాలుగు చోట్ల గాయాలు కావడంతో సర్జరీ చేయడం ఆలస్యం అయ్యిందని డాక్టర్ల చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డికి ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మరో పది రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని చెప్పారు.
Kerala Blast: ఇంటర్నెట్లో చూసి.. బాంబు తయారు చేసి.. ఫోన్ తో పేల్చేశాడు.. నిర్ఘాంతపోయే నిజాలు
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?