DSP Bheem Reddy : ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్ట్
- నాలుగు రోజుల తర్వాత భీమ్‌రెడ్డి అరెస్ట్
- రూ.300 కోట్ల అక్రమాస్తుల కేసులో కీలక చర్య
- అనారోగ్యంతో అరెస్ట్ ఆలస్యం: ఏసీబీ వివరణ
- నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DSP Bheem Reddy : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న డీఎస్పీ భీమ్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించి, దాదాపు రూ. 300 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సోదాల సమయంలో భీమ్‌రెడ్డికి కేవలం నోటీసులు ఇచ్చి వదిలేయడం, అరెస్ట్ చేయకపోవడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఏసీబీ అధికారులు స్పందిస్తూ.. సోదాల సమయంలో భీమ్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండటం వల్లే అప్పట్లో అరెస్ట్ చేయలేదని వివరణ ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే తీవ్ర ఒత్తిడి , విమర్శలు రావడంతో అధికారులు తాజాగా భీమ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమాస్తుల విచారణను మరింత వేగవంతం చేసిన అధికారులు, ఆయనను కాసేపట్లో నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలు సేకరించేందుకు భీమ్‌రెడ్డిని ఏసీబీ కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!