BCG Report 2026: పెట్రోల్ యుగానికి బ్రేక్ పడనుందా? భారత టూ వీలర్ మార్కెట్లో కొత్త ట్రెండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCG Report 2026: ఓవైపు అంతర్జాతీయ పరిణామాలతో క్రూడాయిల్ ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది.. మరోవైపు.. పెట్రో వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు కూడా ఆసక్తి చూపడం లేదట.. భారత్‌లో ద్విచక్ర వాహన మార్కెట్ వేగంగా మారుతోంది. ఇప్పటివరకు పెట్రోల్ స్కూటర్లు, బైక్‌లకు ప్రాధాన్యం ఇచ్చిన వినియోగదారులు.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్, పనితీరు, బ్యాటరీ భద్రతపై సందేహాలు వ్యక్తం చేసిన ప్రజలు.. ప్రస్తుతం వాటిని తమ తదుపరి వాహనంగా పరిగణిస్తున్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) నివేదిక ప్రకారం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారుల వాటా 2024లో 30 శాతంగా ఉండగా, 2026 నాటికి 43 శాతానికి పెరిగింది. అంటే ప్రతి ఇద్దరు కొనుగోలుదారుల్లో దాదాపు ఒకరు ఈవీలను పరిశీలిస్తున్నారన్నమాట.
ఈవీలపై పెరుగుతున్న ఆసక్తి
బీసీజీ రూపొందించిన ‘ఎలక్ట్రిక్ ఇన్ ఛార్జ్’ నివేదిక ప్రకారం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడానికి విముఖత చూపుతున్న వినియోగదారుల సంఖ్య కూడా తగ్గుతోంది. 2024లో 38 శాతం మంది ఈవీల కొనుగోలుపై ఆసక్తి చూపకపోగా, 2026 నాటికి ఈ సంఖ్య 29 శాతానికి పడిపోయింది. దీనిని బట్టి ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల్లో ఉన్న సంకోచం క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు ఇప్పుడు ఈవీల గురించి తెలుసుకోవడానికే పరిమితం కాకుండా, వాటిని తమ రోజువారీ ప్రయాణాలకు అనువైన ఎంపికగా కూడా చూస్తున్నారు.
Also Read
- DA Hike: ఉద్యోగులు, పెన్షన్‌దారులకు శుభవార్త.. రేపే డీఏ పెంపు..?
- Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
- Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
- Bank Holidays: రాబోయే 2 నెలల్లో 33 రోజులు బ్యాంకులు బంద్! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
ద్విచక్ర వాహన మార్కెట్లో పెరుగుతున్న ఈవీల వాటా
వినియోగదారుల అభిప్రాయాల్లో వస్తున్న మార్పు అమ్మకాల గణాంకాల్లోనూ కనిపిస్తోంది. అందించిన నివేదిక వివరాల ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో భారత ద్విచక్ర వాహన అమ్మకాల్లో ఎలక్ట్రిక్ మోడళ్ల వాటా 5.5 శాతంగా ఉంది. 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఈ వాటా 9.9 శాతానికి చేరింది. స్కూటర్ విభాగంలోనూ ఎలక్ట్రిక్ మోడళ్ల ప్రాధాన్యం పెరుగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం స్కూటర్ అమ్మకాల్లో ఈవీల వాటా 16.8 శాతంగా ఉండగా, 2027 ఆర్థిక సంవత్సరం నాటికి అది 24.1 శాతానికి చేరుతుందని నివేదిక పేర్కొంది.. అంటే, 2022 నుంచి 2026 ఆర్థిక సంవత్సరాల మధ్య భారత ద్విచక్ర వాహన మార్కెట్ సగటున ఏటా సుమారు 12 శాతం వృద్ధి చెందగా, స్కూటర్ మార్కెట్ సుమారు 19 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసినట్లు ఆ నివేదిక తెలిపింది. ఇదే సమయంలో పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు మూడు రెట్లకు పైగా వేగంతో పెరిగినట్లు వివరించింది. ఈ పరిణామాలు ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాయని సూచిస్తున్నాయి.
నెలకు 1.8 లక్షల మంది కొత్త వినియోగదారులు
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ ఇప్పుడు తొలిసారి ఈవీ కొనుగోలు చేసేవారికే పరిమితం కావడం లేదు. 2026 ఆగస్టు నాటికి నెలకు సుమారు 1.8 లక్షల మంది కొత్త వినియోగదారులు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. గతంలో ఈవీలను ఎంచుకునే వారి సంఖ్య పరిమితంగా ఉండగా, ప్రస్తుతం రోజూ కార్యాలయాలకు వెళ్లేవారు, పట్టణాల్లో ప్రయాణించేవారు కూడా వీటిని ఆచరణీయమైన ప్రత్యామ్నాయంగా పరిగణిస్తున్నారని రాసుకొచ్చింది..
డిజైన్, పికప్‌పై మారిన అభిప్రాయాలు
ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరగడానికి వాటి డిజైన్, వేగం, పికప్, పనితీరు వంటి అంశాలు కూడా కారణమవుతున్నాయి. గతంలో పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ల డిజైన్, పనితీరు తక్కువగా ఉంటాయని భావించినవారు.. ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు. రోజువారీగా తక్కువ దూరాలు ప్రయాణించే వినియోగదారుల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల డిజైన్‌ను మెరుగైనదిగా భావించే వారి వాటా 2024లో 30 శాతంగా ఉండగా, 2026 నాటికి 59 శాతానికి పెరిగినట్లు బీసీజీ నివేదిక వెల్లడించింది. అలాగే, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పికప్ నాణ్యతపై సానుకూల అభిప్రాయం కలిగిన వినియోగదారుల వాటా కూడా పెరిగింది. 2024లో 27 శాతం మంది మాత్రమే వాటి పికప్ బాగుందని భావించగా, 2026 నాటికి ఈ సంఖ్య 48 శాతానికి చేరింది. డిజైన్, వేగం, పనితీరు, బ్రాండ్‌పై పెరుగుతున్న నమ్మకం.. గతంలో ఈవీలను కొనుగోలు చేయడానికి వెనుకాడిన వినియోగదారులను కూడా వాటి వైపు ఆకర్షిస్తున్నాయి.
బ్యాటరీ రేంజ్, సర్వీసింగ్‌పై ఇంకా సందేహాలు
అయితే, ఈవీలపై విశ్వాసం పెరుగుతున్నప్పటికీ, వినియోగదారుల ఆందోళనలు పూర్తిగా తొలగిపోలేదు. బ్యాటరీ రేంజ్, భద్రత, సర్వీసింగ్ సౌలభ్యం, మరమ్మతుల ఖర్చు, పనితీరు, దీర్ఘకాలిక నిర్వహణ వ్యయాలపై ఇంకా సందేహాలు ఉన్నాయి. పెట్రోల్ వాహనాల మాదిరిగానే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా దీర్ఘకాలంలో నమ్మకంగా పనిచేస్తాయా? బ్యాటరీ ఎంతకాలం మన్నుతుంది? ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయా? వంటి ప్రశ్నలకు వినియోగదారులు సమాధానాలు కోరుకుంటున్నారు. బీసీజీ నివేదిక వినియోగదారులను ఈవీలపై ఆసక్తి ఉన్నవారు, ఇంకా నిర్ణయం తీసుకోనివారు, ఈవీలను ఇష్టపడనివారుగా విభజించింది. గత రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి ఉన్న వినియోగదారుల సమూహం 1.5 రెట్లు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. అయినప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనాలను ఇష్టపడని వారి వాటా మార్కెట్లో సుమారు 20 శాతంగా కొనసాగుతోంది. నిర్వహణ, మరమ్మతుల ఖర్చులు, లగేజీ నిల్వ, సౌకర్యం, ట్రాఫిక్‌లో నడపడం, డిజిటల్ ఫీచర్లు వంటి అంశాల్లో ఈవీల వాస్తవ వినియోగ అనుభవాలు వినియోగదారుల అంచనాలను అందుకున్నాయని లేదా మించిపోయాయని కూడా నివేదిక పేర్కొంది. ఇలాంటి అనుభవాలు ఎలక్ట్రిక్ వాహనాలపై నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి.
జెన్ జెడ్ యువతకు స్టైలిష్ ఈవీలు
యువతరానికి చెందిన జెన్ జెడ్ వినియోగదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపుతున్నట్లు నివేదిక సూచిస్తోంది. వీరు స్టైలిష్‌గా ఉండటంతో పాటు, కఠినమైన రోడ్లపై కూడా మన్నికగా పనిచేసే ద్విచక్ర వాహనాలను కోరుకుంటున్నారు. డిజైన్, సౌకర్యం, మన్నిక, ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ ఒకే వర్గానికి పరిమితం కాకుండా, వివిధ వయసులు, అవసరాలు కలిగిన వినియోగదారులకు విస్తరిస్తోంది. ఇక, భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మోడళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. 2023తో పోలిస్తే మార్కెట్లో ఈవీ మోడళ్ల సంఖ్య సుమారు 30 శాతం పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మోడళ్ల సంఖ్య రెట్టింపైనట్లు నివేదిక పేర్కొంది. అయితే, ఎంపికలు పెరిగినా ఐదు టాప్ బ్రాండ్ల మార్కెట్ వాటా సుమారు 83 శాతం వద్ద కొనసాగుతోంది. అంటే మార్కెట్లో పోటీ పెరుగుతున్నప్పటికీ, ప్రముఖ కంపెనీలు ఇప్పటికీ గణనీయమైన ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయి.
ఈవీ కంపెనీలకు బీసీజీ సూచనలు
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీలు మెరుగైన డిజైన్, విభిన్న మోడళ్ల అభివృద్ధి, కొనుగోలు తర్వాత సేవలు, వినియోగదారుల విశ్వాసంపై దృష్టి పెట్టాలని బీసీజీ నివేదిక సూచిస్తోంది. ఒకే రకమైన స్కూటర్ లేదా బైక్‌ను అందించడం కంటే, వేర్వేరు వినియోగదారుల అవసరాలకు సరిపోయే మోడళ్లను రూపొందించడం ముఖ్యం. బ్యాటరీ భద్రత, రేంజ్, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, సర్వీసింగ్ సౌలభ్యం వంటి అంశాల్లో మెరుగుదల తీసుకురావడం కూడా అవసరం. మొత్తంగా, భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈవీలపై ప్రజల్లో ఆసక్తి, నమ్మకం పెరుగుతున్నప్పటికీ, బ్యాటరీ రేంజ్, భద్రత, నిర్వహణ, ఛార్జింగ్ సదుపాయాల విషయంలో కంపెనీలు మరింత మెరుగైన పరిష్కారాలు అందించాల్సి ఉంది. పెట్రోల్ వాహనాలకు ఈవీలు గట్టి పోటీ ఇస్తున్నా, పెట్రోల్ యుగం పూర్తిగా ముగిసిపోయిందని చెప్పడానికి ఇంకా సమయం ఉంది. అయితే, భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల పాత్ర మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు పాక్ దిగ్గజాలు ఫిదా..‘‘ఇంతటి విధ్వంసాన్ని ఎప్పడూ చూడలేదు!’’
-
Yuvraj Singh: అభిషేక్.. నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 చేయలేకపోతున్నావ్: యువరాజ్ సింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
BCG Report 2026: పెట్రోల్ యుగానికి బ్రేక్ పడనుందా? భారత టూ వీలర్ మార్కెట్లో కొత్త ట్రెండ్..
-
Shehbaz Sharif: “కాశ్మీరీలను భారత్ అణచివేస్తోంది”.. పాక్ ప్రధాని ఆరోపణలు.!
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!