Mega DSC 2024: గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega DSC 2024: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేసారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ద్వారా మొత్తం 11,062 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)-6,508 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2,629 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్-727, పీఈటీలు-182, స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు స్పెషల్ కేటగిరీ విభాగంలో ఉన్నాయి. 5,089 పోస్టులతో గతేడాది సెప్టెంబర్ 6న విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఫిబ్రవరి 28 రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాత పోస్టులకు కొత్త ఖాళీలను జోడిస్తూ కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అయితే పాత దరఖాస్తులే చెల్లుబాటు అవుతాయని, కొత్త డీఎస్సీని పరిశీలిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇప్పటికే ప్రకటించారు. అంటే పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదు.
Read also: NASA : అంతరిక్షంలో నేడు ఢీకొననున్న రెండు ఉపగ్రహాలు.. భయాందోళనలో శాస్త్రవేత్తలు
Also Read
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ఫిబ్రవరి 28న డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావించినా షెడ్యూల్, సాఫ్ట్వేర్ డిజైన్ తుది మెరుగులు దిద్దాల్సి ఉండటంతో వాయిదా పడింది. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వాటితోపాటు కొత్త పోస్టులను కూడా చేర్చి డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. అయితే గతంలో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో ఇప్పటికే 4 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. వారంతా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రశ్నాపత్రాల నుంచి ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగానే సాఫ్ట్ వేర్ రూపకల్పనపై మరింత శ్రద్ధ పెట్టారు. పాస్వర్డ్లు, ఆన్లైన్ సిస్టమ్ భద్రతను సీనియర్ అధికారులు సమీక్షిస్తారు. సాంకేతిక రంగంలో ప్రయివేటు కంపెనీల పాత్ర పోషిస్తున్నందున విద్యాశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కీలక పాత్ర పోషిస్తున్న అధికారులు ప్రతి అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.
TS sheep Scam: గొర్రెల పంపిణీ స్కాం.. ఏసీబీ కస్టడీలో ఆ నలుగురు..!
తాజావార్తలు
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!