Drone: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం సాహా గ్రామంలోని పంట పొలాలపై ఆదివారం విమానం ఆకారంలో డ్రోన్ పడి ఉండటం కలకలం రేపింది. అదే సమయంలో ఆ ప్రాంతంలో మేకలను మేపుతున్న మేకల కాపరికి విమాన ఆకారంలో వున్న డ్రోన్ కంటపడింది. అయితే ముందు అతను దాన్ని వినానం అని అనుకున్నా.. అది అనుమానాస్పదంగా కనిపించడంతో.. తన కొడుకుని పిలిచాడు. దీంతో అక్కడకు చేరుకున్న కొడుకు తన స్నేహితులకు ఫోన్ ద్వారా పిలిపించాడు. దీంతో అందరూ అక్కడకు చేరుకుని భయాందోళనకు గురయ్యారు. ఇక పోలీసులకు సమచారం అందిద్దామని డయిల్ 100కు కాల్ చేశారు. సమచారం అందుకున్న
ఎస్.ఐ సతీష్, పోలీసు సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Read also: Telangana Govt: కులవృత్తిదారులకు గుడ్ న్యూస్.. పూర్తి సబ్సిడీతో రూ.లక్ష ఆర్థిక సాయం
విమాన ఆకారంలో వున్న డ్రోన్ ను చూసి షాక్ తిన్నారు. డ్రోన్ ను క్షుణ్నంగా పరిశీలించారు పరిశీలించారు. ఈ డ్రోన్‌లో ఎయిర్‌టెల్ సిమ్, సీసీ కెమెరాలు, జీపీఎస్, బ్యాటరీ లభ్యమయ్యాయి. 76 నంబర్ గల ఈ డ్రోన్ రెక్కలపై ఎఫ్ ఎల్ 216020220415099 నెంబరు ఉందని.. ఐదడుగుల పొడవు, ఐదడుగుల వెడల్పు ఉన్న ఈ డ్రోన్ 15 కిలోల బరువు ఉంటుందని ఎస్ ఐ తెలిపారు. పంట పొలాల్లో పడిన ఈ డ్రోన్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అనంతరం బాంబు స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. బాంబుల జాడలేవీ లేవని నిర్ధారించారు. డ్రోన్‌లోని సిమ్‌కార్డ్‌ని తొలగించి కనెక్ట్ చేసేందుకు ప్రయత్నించగా, సిమ్ కార్డ్ కనెక్ట్ కాలేదు. అనంతరం డ్రోన్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Pocharam Srinivas Reddy: కేసీఆర్ ఆదేశాలతో పోటీ చేస్తా.. వచ్చే ఎన్నికలపై సభాపతి క్లారిటీ