ఎంత నిఘా పెట్టినా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్స్ దందా కొనసాగుతుందనేది ఓపెన్ సీక్రెట్.. ఎందుకంటే.. ఎప్పకప్పుడు భారీ స్థాయిలో డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి.. ఇక, ఇవాళ సినీ ఫక్కీలో ఓ వ్యక్తి కడుపు డ్రగ్స్ దాచి తరలిస్తున్నాడు.. ఆ వ్యక్తికి ఆపరేషన్ చేసి కొకైన్ క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్న ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం రేపింది. రూ.12 కోట్ల విలువైన 1,157 గ్రాముల కొకైన్‌ను డీఆర్‌ఐ అధికారులు సీజ్ చేశారు. సౌతాఫ్రికా జోహన్నెస్‌బర్గ్ ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించడంతో.. అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. క్యాప్యూల్స్ రూపంలో కొకైన్ కడుపులో దాచినట్లు గుర్తించారు. దాంతో అతడికి ఆపరేషన్ చేసి 79 కొకైన్ క్యాప్యూల్స్ స్వాధీనం చేసుకున్నారు.
Read Also: PM Modi: మళ్లీ కోవిడ్ టెన్షన్.. సీఎంలతో ప్రధాని మోడీ భేటీ