రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం గగన విహారం చేశారు. అంబాలా వైమానిక దళ కేంద్రం నుంచి రాఫెల్ యుద్ధ విమానంలో విహరించారు. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌పై భారత్ ప్రయోగించిన రాఫెల్ విమానంలోనే రాష్ట్రపతి ప్రయాణించారు.
President Droupadi Murmu Speech in Budget Session 2024: కొత్త పార్లమెంట్ భవనంలో ఇదే తన తొలి ప్రసంగం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. తెలంగాణలో సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోందన్నారు. భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైనదని కొనియాడారు. ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణం అని, చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలిదేశంగా భారత్ రికార్డు సాధించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 2024 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం అయ్యాయి.…
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ములుగు జిల్లా రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా రామప్ప దేవాలయం చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామప్ప ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ఎలాంటి అలజడి జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
క్రికెట్ దిగ్గజం, భారతరత్న పురస్కార గ్రహీత సచిన్ టెండుల్కర్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుసుకున్నారు. ముంబై పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. శుక్రవారం ఉదయం రాజ్ భవన్‌లో సచిన్‌తో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం అధికారికంగా ట్విట్టర్ పేజీలో ప్రకటించింది. పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. అయితే ఇది మర్యాదపూర్వక భేటీనే అని తెలుస్తోంది. కాగా రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 25తో ముగియనుంది.…