Mancherial Hospital: మంచిర్యాలలోని ప్రభుత్వం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఉద్రిక్తతకు దారి తీసింది. లయా అనే గర్భిణి పురుటి నొప్పులతో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో దూదిను మరిచిపోయారు. ఇంటికి వెళ్లిన లయా మూత్ర విసర్జన చేయడం, కడుపులో నొప్పి రావడంతో అస్వస్థతకు గురై, మరో ఆస్పత్రికి వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది.
Read also: Weather Update: మళ్లీ వర్షాలు.. ఆ రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్..
వివరాల్లోకి వెళితే.. ఐదు రోజుల క్రితం వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తి లయకు కడుపునొప్పి రావడంతో.. కుటుంబ సభ్యులు ఆమెను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఆమెకు సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగింది. ఆపరేషన్ సక్సెస్ అయింది.. కీర్తి లయ పండంటి పాపకు జన్మనిచ్చింది. అయితే ఆపరేషన్ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె కడుపులో దూదిని వదిలేసి కుట్లు వేశారు. దీంతో కీర్తి లయ తీవ్ర అస్వస్థతకు గురైంది. సోమవారం రాత్రి ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు చెన్నూరు ఆస్పత్రికి తరలించారు. కీర్తి లయకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు కడుపులో దూది ఉన్నట్లు గుర్తించారు. తర్వాత ఆపరేషన్ చేసి దూదిని బయటకు తీశారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెలివరీకి వస్తే ప్రాణాలు తీస్తారా? అంటూ మండిపడ్డారు. వైద్యుల నిర్లక్ష్యంపై మీడియాలో కథనాలు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
Read also: Bangalore: శాస్త్రవేత్తను కత్తులతో వెంబడించిన గుండాలు.. కారు అద్దం పగులగొట్టి ఆపై..
నాగర్ కర్నూల్ లో.. వారం రోజుల క్రితం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ప్రసవం తర్వాత ఆమె చనిపోయింది. శస్త్రచికిత్సతో ఆమె కడుపులో పత్తి మిగిలిపోయింది. ప్రసవం రోజున వైద్యులు ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సమయంలో, వైద్యులు దూదిని తీయడం మర్చిపోయి కడుపులోనే పెట్టి కుట్లు వేశారు. కొన్ని రోజుల తర్వాత, ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆపరేషన్ జరిగిన వారం తర్వాత మహిళకు తీవ్ర రక్తస్రావం మొదలైంది. ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
NTR Devara: సముద్రగర్భంలో యుద్ధం… యంగ్ టైగర్ సిద్ధం!