మొన్నటివరకు భారీ వర్షాలు కురిసాయి.. దీంతో జనాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూస్తూనే ఉన్నాం.. ఇప్పటికి పలు ప్రాంతాల్లో నీళ్లు కనిపిస్తున్నాయి.. ఈ మధ్య కాస్త వర్షాల నుంచి పీల్చుకున్న జనాలకు ఇప్పుడు మరో బాంబ్ ను పేల్చింది వాతావరణ శాఖ.. మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.. ఇదే సమయంలో పలు చోట్ల సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఆగస్టు 31 వరకు పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది..
ఈ నెల 31 న వరకు భారతదేశంలోని ఈశాన్య, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ గత ఆదివారం అంచనా వేసింది. ఆగస్టు 28 నుంచి 31 వరకు అస్సాం, మేఘాలయలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, అండమాన్ నికోబార్ దీవుల్లో ఆగస్టు 28 నుంచి 31 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది..
ఇదిలా ఉండగా.. మరో వారం రోజుల పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో మందకొడి వర్షపాతం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తన అంచనాలో పేర్కొంది. పశ్చిమ అస్సాం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం, హిమాలయాల దిగువ ప్రాంతాల గుండా ప్రవహించే రుతుపవనాల ద్రోణి ఇందుకు కారణమని ఐఎండీ పేర్కొంది. వీటితో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు..ఆగస్టు 29న అండమాన్ నికోబార్ దీవుల్లో, ఆగస్టు 30,31 తేదీల్లో ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈనెల 29 తేదీన పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న నైరుతి అరేబియా సముద్రంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది..