కేసీఆర్ కేంద్రం ముందు మెడలు వంచుకున్నారా: జీవన్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ర్టంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్షాలకు మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికే చాలా చోట్ల వరిధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తుండటంతో పలు చోట్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే రాజకీయ నాయకులు మాత్రం వరి పంటనే కేంద్రంగా విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయ రణరంగా మార్చుతున్నారు. తాజాగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వరిధాన్యం కొనుగోలు గురించి ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు రెండు తోడు దొంగలని విమర్శించారు.
చివరి గింజ వరకు కొంటామని, కేంద్రం మెడలు వంచుతామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. కేంద్రం ముందు మెడలు వంచుకున్నారా..? అంటూ ఫైర్ అయ్యారు. రైస్ మిల్లర్ల చెప్పు చేతుల్లో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోందని ఆయన విమర్శించారు. ఇప్పటికే రాష్ర్టంలో ఓ వైపు రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటే కేసీఆర్ మాత్రం పర్యటనలు అంటూ ఢిల్లీ వెళ్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రైతులపై రాజకీయాలు మాని వెంటనే ఖరీఫ్‌లో పండించిన ధాన్యాన్ని కొనాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
Also Read
- Cheyutha Pensions: గుడ్‌న్యూస్.. దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు..
- Telangana Student Missing: అమెరికాలో తెలంగాణ యువతి మిస్సింగ్.. బోస్టన్‌లో తీవ్ర కలకలం
- Hyderabad: భర్తలు తేవడం.. భార్యలు అమ్మడం.. ఆల్వాల్‌లో డిఫెన్స్ మద్యం దందా!
- Panchayat Raj Act : పంచాయతీలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. నిధులపై కొత్త రూల్
- Tags
- congress
- Farmers
- jeevan reddy
- kcr
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!