Site icon NTV Telugu

DK Aruna: కాపలా కుక్కలా ఉంటానని కేసీఆర్ మాట తప్పాడు

Dj Aruna On Kcr

Dj Aruna On Kcr

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర రెండో దశ నేడు పాలమూరు గడ్డపై ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన డీకే అరుణ.. తెలంగాణ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ అడుగడుగునా మోసం చేశారని, ఇచ్చిన హామీల్ని ఏమాత్రం నెరవేర్చలేదని అన్నారు. ఇక్కడి ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు తాను కాపలా కుక్కలా ఉంటానని, ప్రాజెక్టుల్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేస్తానని మాటిచ్చాడని, కానీ ఇప్పుడా హామీల్ని తుంగలో తొక్కేశాడని ఆమె విమర్శించారు.

బీజేపీ మద్దతు ఇవ్వకుంటే, అసలు తెలంగాణ ఏర్పాటు అయ్యేదే కాదన్నారు. అమరుల త్యాగాల మీదే కేసీఆర్ గద్దెనెక్కాడని, ఆయన మాటల్ని నమ్మి పాలమూరు ప్రజలు మోసపోయారన్నారు. ఇక్కడ నాయకులు భూ దందాలు, ఇసుక దందాలు చేస్తున్నారని ఆరోపించిన అరుణ.. ఎవరైనా ప్రశ్నిస్తే, వారిపై కేసులు పెట్టి హింసిస్తున్నారన్నారు. బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, గట్టు, RDS ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు? నిలదీశారు. భూములు కనిపిస్తే చాలు, కబ్జా చేసేస్తున్నారని ఆగ్రహించారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయని డీకే అరుణ వెల్లడించారు.

Exit mobile version