Fish Prasad: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. 34 కౌంటర్లు, 32 క్యూలు సిద్ధం చేసి.. వికలాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. ఈ రెండు రోజుల తర్వాత మరో వారం రోజుల పాటు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. శుక్రవారం 9 ఉదయం 8 గంటల నుంచి చేప మందు పంపిణీ ప్రారంభమై 10వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తెలో బత్తిని కుటుంబీకులు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. చేప ప్రసాదం తయారీలో అనేక దశలు ఉన్నాయి. ముందుగా దూద్ బౌలిలోని బత్తిని హరినాథ్ గౌడ్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం, బావి పూజలు నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులందరూ ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రజలకు పంపిణీ చేస్తారు. ఇంటి బావిలోని నీళ్లతో ఈ చేప ప్రసాదాన్ని తయారుచేయడం ఆనవాయితీగా వస్తోంది. బత్తిని కులస్తులైన వీరన్న గౌడ్, శివరాంగౌడ్ నుంచి చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది.
Read also: Devara : ఎన్టీఆర్‌కు షాకివ్వబోతున్న జాన్వీ..అదిరిపోయే క్లైమాక్స్..
మొదట్లో 50 కిలోల వరకు తయారు చేసేవారు. అయితే చేపల ప్రసాదానికి ఆదరణ పెరగడంతో డిమాండ్ పెరిగింది. దీంతో బత్తిని సోదరులు ప్రస్తుతం మూడున్నర క్వింటాళ్ల చేప ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నారు. మరోవైపు హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి చేప ప్రసాదం కోసం రెండు, మూడు రోజుల ముందే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకుంటున్నారు. మరోవైపు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, కలెక్టర్ అమోయ్‌కుమార్ ఆధ్వర్యంలో బత్తిని హరినాథ్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖలు చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేశాయి. ఈ చేప ప్రసాదం పంపిణీ రెండు రోజులకు గాను 5 లక్షల మందిని సంతృప్తి పరిచేందుకు 5 క్వింటాళ్ల చేప ప్రసాదాన్ని సిద్ధం చేశారు. మత్స్యశాఖ ఇప్పటికే 2.5 లక్షల కొర్రమీను చేప పిల్లలను సిద్ధం చేసింది. ఈ చేప ప్రసాదాన్ని చిన్న పిల్లల నుంచి వందేళ్ల వరకు ఎవరైనా తినవచ్చని, అయితే గర్భిణులు మాత్రం తీసుకోవద్దని హరినాథ్ గౌడ్ కుమార్తె తెలిపారు. ఈ చేప ప్రసాదాన్ని ఖాళీ కడుపుతో లేదా భోజనం చేసిన మూడు గంటల తర్వాత తీసుకోవడం మంచిది. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 34 కౌంటర్లు, 32 క్యూలు ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధులు, మహిళలకు ప్రత్యేక క్యూలు, కౌంటర్లు ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు ఇక్కడ పంపిణీ చేసిన తర్వాత, బత్తిని కుటుంబం పాత బస్తీలోని దూద్‌బౌలిలోని వారి నివాసంలో వారం రోజుల పాటు ఈ చేప ప్రసాదాన్ని అందజేయనున్నారు. చేప ప్రసాద వితరణకు సర్వం సిద్ధమైంది.
KTR: నేడు మహబూబ్‌నగర్‌కు కేటీఆర్.. జడ్చర్లలో 560 డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభం