Bathukamma Sarees: మహిళలు రెడీగా వుండండి.. నేటి నుంచి మీ ఇంటి బతుకమ్మ చీర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Distribution of Bathukamma sarees from today: బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ప్రభుత్వం ఇచ్చే చీరల పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. కోటి మందికిపైగా లబ్దిదారులకు చేరేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 24 రకాల డిజైన్లు, 10 ఆకర్షణీయమైన రంగులలో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో చీరలను ప్రభుత్వం తయారుచేయించింది. ఇందుకోసం రూ.339 కోట్లు ఖర్చుచేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం సాగుతుంది.
రాష్ట్రంలోని ఈ నెల 25వ తేదీ నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ప్రతీ ఏటా దసరా కంటే ముందు ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాల కంటే ముందుగానే ఆడపడుచులకు బతుకమ్మ సారే పేరుతో తెలంగాణ ప్రభుత్వం కానుకను అందిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ సర్కార్ ఈ సారి కూడా చీరల పంపిణీకి సిద్ధం అయ్యింది. నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టనున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.. ఈ ఏడాది కోటి బతుకమ్మ చీరల పంపిణీ చేయనుంది. ఈ సంవత్సరం (24) విభిన్న డిజైన్లు (10) రకాల ఆకర్షణీయమైన రంగులలో మొత్తం (240) రకాల దారపు పోగుల అంచులతో చీరలు సిద్ధం చేశారు.. 92.00 లక్షల రెగ్యులర్ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వయోవృద్ధ మహిళలు ధరించే 9.00 మీటర్లు పొడవు గల 8 లక్షల చీరలు సిద్ధం చేశారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
బతుకమ్మ చీరల ప్రాజెక్టు కొరకు మొత్తం రూ. 339.73 కోట్ల ఖర్చు చేస్తోంది. బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్న జీవితాల్లో వెలుగులు నిండాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈసారి కోటి మంది తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుక ఇవ్వడం పట్ల సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. నేటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపీణీ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. కాగా, రేషన్ కార్డుల ఆధారంగా అర్హులైన మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. దసరా పండుగ, బతుకమ్మ పండుగను పురస్కరించుకుని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ఆడపడుచులకు చీరలు అందిస్తున్నారు. రేషన్ కార్డుల్లో పేరు ఉండి 18 ఏళ్లు పైబడి, అర్హులైన ప్రతీ మహిళకు బతుకమ్మ చీర అందనుంది.
Nithin Gadkari Rajahmundry Tour: రాజమండ్రిలో నితిన్ గడ్కరీ పర్యటన.. ఐదు ఫ్లైఓవర్లకు శంకుస్థాపన
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!