ఇవాళ రాజమండ్రిలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. 216 జాతీయరహదారిపై ఐదు ఫ్లైఓవర్లకు శంఖుస్థాపన చేయనున్నారు నితిన్ గడ్కరీ. రాజమండ్రి మోరంపూడి, జొన్నాడ జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్ , తేతలి, కైకరం వద్ద నాలుగు లేన్ల ఫ్లైఓవర్ల నిర్మాణం చేయనున్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల బహిరంగ సభ వద్ద మూడు వేల కోట్ల రూపాయల హైవే ప్రాజెక్టులకు శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు నితిన్ గడ్కరీ.
Read Also: Praja Sangrama Yathra: ముగింపు సభ.. హాజరుకానున్న కేంద్ర సహాయ మంత్రి..?
గడ్కరీతోపాటు పర్యటనలో పాల్గొననున్నారు మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొంటారు. శంకుస్థాపన కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం కడియం నర్సరీలకు వెళ్లనున్నారు నితిన్ గడ్కరీ. ఈ ఫ్లై ఓవర్ల నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు తీరతాయని భావిస్తున్నారు.
కేంద్ర మంత్రి శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టుల వివరాలు
1) వాకలపూడి – ఉప్పాడ – అన్నవరం NH – 516F లేనింగ్‌కు శంకుస్థాపన, ప్రాజెక్ట్ పొడవు 40.621 కిమీ ప్రాజెక్ట్ వ్యయం : రు.1345 కోట్లు.
2) సామర్లకోట – అచ్చంపేట జంక్షన్ NH – 516F 4 లేనింగ్, ప్రాజెక్ట్ పొడవు: 12.25 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు. 710 కోట్లు,
3) రంపచోడవరం నుండి కొయ్యూరు NH – 516E వరకు 2-లేన్ల నిర్మాణం, ప్రాజెక్ట్ పొడవు: 70.12 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు. 570 కోట్ల,
4) కైకరం NH – 216A వద్ద 4-లేన్ ఫ్లైఓవర్ నిర్మాణం, ప్రాజెక్ట్ పొడవు: 1.795 కిమీ, ప్రాజెక్ట్ వ్యయం: రు.70 కోట్లు,
5)రాజమండ్రి మోరంపూడి NH – 216A వద్ద 4-లేన్ ఫ్లైఓవర్ పని ప్రారంభం, ప్రాజెక్ట్ పొడవు: 1.42 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు. 60 కోట్లు.
6) ఉండ్రాజవరం NH – 216A వద్ద 4-లేన్ ఫ్లైఓవర్ నిర్మాణం, ప్రాజెక్ట్ పొడవు: 1.25 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు.35 కోట్లు,
7) తేతాలి NH – 216A వద్ద 4-లేన్ ఫ్లైఓవర్ నిర్మాణం, ప్రాజెక్ట్ పొడవు: 1.03 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు. 35 కోట్లు,
8) జొన్నాడ NH – 216A వద్ద 4-లేన్ ఫ్లైఓవర్ నిర్మాణం, ప్రాజెక్ట్ పొడవు: 0.93 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు. 25 కోట్లు.