Site icon NTV Telugu

Dharani Special Drive: సచివాలయంలో ధరణి కమిటి సమావేశం.. అప్లికేషన్లపై సమీక్ష

Dharani Special Drive

Dharani Special Drive

Dharani Special Drive: ధరణి సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్నం 12:30కి సచివాలయంలో ధరణి కమిటి సమావేశం కానుంది. ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్ పై కమిటీ సమీక్షించనుంది. ధరణి డ్రైవ్ లో పరిష్కరించిన అప్లికేషన్లపై సమీక్ష నిర్వహించనున్నారు. జూన్ నాలుగులోగా ఎట్టి పరిస్థితుల్లో ధరణి పెండింగ్ అప్లికేషన్స్ ను క్లియర్ చేయాలని టార్గెట్ చేస్తున్నారు. ధరణిలో మొత్తం 119 తప్పులలో స్పెషల్ డ్రైవ్ తర్వాత 76 తప్పులను పరిష్కరించాల్సి ఉందని ధరణి కమిటీ గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ తర్వాత పరిష్కారమైన లక్ష అప్లికేషన్లతో పాటు పెండింగ్ అప్లికేషన్ లపై సమీక్ష చేపట్టనున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ధరణి దరఖాస్తులు పరిష్కారం కాకపోవడంతో ధరణి పోర్టల్‌, కలెక్టర్ల లాగిన్‌లో కుప్పలు తెప్పలుగా పెండింగ్‌లో ఉన్నాయి.

Read also: Medigadda: మేడిగడ్డ పనులు ప్రారంభం.. బ్లాక్‌-7లో 8 గేట్లను ఎత్తివేసేందుకు చర్యలు

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి దరఖాస్తుల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సూచనల మేరకు ధరణి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని పరిశీలించడానికి మరియు ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి సంబంధిత నివేదికలు తయారు చేయబడ్డాయి. వీటిని త్వరలోనే పరిష్కరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. మార్చి 16న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ఉండడంతో ధరణి దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవడం మానేశారు. ఈ క్రమంలో శనివారం కమిటీ సమావేశం కానుంది. జూన్ 4లోగా ధరణిలో సమస్యలు పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్న కమిటీ.. ఆ తర్వాత ధరణి పోర్టల్ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కమిటీకి స్పష్టం చేసింది. తప్పులను సరిదిద్దే పనిలో కమిటీ నిమగ్నమైంది.
TS Eamcet Results: నేడు తెలంగాణ ఎంసెట్ రిజల్ట్.. 11 గంటలకు పలితాలు విడుదల..

Exit mobile version