DGP Anjani Kumar: పండుగపూట కూడా ప్రజల రక్షణే ధ్యేయంగా రోడ్లపై గస్తీ కాస్తుంటాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Anjani Kumar: ఎలాంటి పండుగనైనా ప్రజలు కుటుంబాలతో గడిపితే పోలీసు సిబ్బంది మాత్రం రోడ్డుపై పెట్రోలింగ్ చేస్తూ ఉంటారని డీజీపి అంజనీ కుమార్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీసు జెండా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో డీజీపీ అంజనీకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దేశవ్యాప్తంగా 189 మంది పోలీస్ సిబ్బంది వీరమరణం పొందారని అన్నారు. 189 మంది సిబ్బందికి నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. దేశంలోని పోలీస్ శాఖలో ఉన్న పలు విభాగాలకు లీడర్ గా ఉందన్నారు. గత నాలుగేళ్లుగా తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ స్థలంలో ఉన్నారని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటులో కూడా దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందని అన్నారు. భరోసా సెంటర్ దేశంలో రోల్ మోడల్ గా మారిందన్నారు. దేశ ప్రజలు ఇండల్లో ప్రశాంతంగా పండుకుంటున్నారంటే రోడ్డుపై పోలీసుల విధి నిర్వహణే కారణమని తెలిపారు.
ఎలాంటి పండుగనైనా ప్రజలు కుటుంబాలతో గడిపితే పోలీసు సిబ్బంది మాత్రం రోడ్డుపై పెట్రోలింగ్ చేస్తూ ఉంటారని తెలిపారు. కోవిడ్ సమయంలో ప్రజలంతా కుటుంబసభ్యులతో ఇళ్ళల్లో ఉంటే, కానిస్టేబుల్ సిబ్బంది మాత్రం తమ ప్రాణాలను పణంగా పెట్టి రోడ్లపై విధి నిర్వహణ చేశారని గుర్తు చేశారు. విధి నిర్వహణ ఛాలెంజ్లను ధైర్యంగా ఎదుర్కొంటున్న సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నానని అంజనీకుమార్ తెలిపారు. గొప్ప విజయం గొప్ప త్యాగం నుండి వస్తుందని అన్నారు. సమాజం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు డీజీపీ అంజనీకుమార్ నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. పోలీసు అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ‘అమరులువారు’ పుస్తకాన్ని డీజీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోలీసు కవాతు ప్రత్యేకత సంతరించుకుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ ఏడాది మరణించిన 189 మంది పోలీసు అధికారుల పేర్లను చదివి వారి సేవలను స్మరించుకున్నారు.
Singareni: సింగరేణి కార్మికులకు దసరా సంబురాలు.. ఒక్కొక్కరికి 1.53 లక్షలు జమ..
Also Read
- TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
- Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
తాజావార్తలు
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?