The Kerala Story 2: “ది కేరళ స్టోరీ 2’కు సెన్సార్ షాక్: ఏకంగా 16 కట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద అంశాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ది కేరళ స్టోరీ 2’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అయితే, థియేటర్లలోకి రావడానికి ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ (CBFC) గట్టి షాక్ ఇచ్చింది. సినిమాలో ఉన్న పలు అభ్యంతరకర దృశ్యాలపై కత్తెర వేయడంతో పాటు, ఏకంగా 16 మార్పులు చేస్తేనే అనుమతిస్తామని తేల్చి చెప్పింది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘U/A 16+’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. కానీ ఈ ప్రక్రియలో మేకర్స్‌కు చుక్కలు కనిపించాయి. ముఖ్యంగా హింస మరియు అసభ్యకరంగా ఉన్న సీన్లపై బోర్డ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాలో ఉన్న ఒక ముద్దు సీన్‌ను ఏడు సెకన్ల పాటు తగ్గించాలని ఆదేశించింది. అలాగే లైంగిక వేధింపులు, అత్యాచారాలకు సంబంధించిన దృశ్యాలను సగానికి పైగా కత్తిరించింది. మహిళలపై భౌతిక దాడులు, చెంపదెబ్బలు కొట్టే సీన్లను కూడా కొన్ని సెకన్ల మేర తగ్గించారు.
Also Read:Virosh: ఒకేరోజు రెండు సార్లు పెళ్లి చేసుకోనున్న విజయ్ – రష్మిక
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఒక ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేసే సన్నివేశంలో కూడా మార్పులు చేయాలని బోర్డ్ సూచించింది. వీటితో పాటు కొన్ని వివాదాస్పద డైలాగులను మ్యూట్ చేయడం లేదా పూర్తిగా తొలగించడం జరిగింది. సినిమా ప్రారంభంలో దాదాపు రెండు నిమిషాల నిడివి గల సుదీర్ఘ డిస్క్లైమర్‌ను వాయిస్ ఓవర్‌తో సహా ప్రదర్శించాలని బోర్డ్ ఆదేశించింది. ఇది యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన కథ అని చెప్పడంతో పాటు, తాము చూపిస్తున్న అంశాలు నిజమేనని నిరూపించే స్క్రిప్ట్ ఆధారాలను కూడా మేకర్స్ సెన్సార్ బోర్డుకు సమర్పించాల్సి వచ్చింది. ఈ మార్పులు చేర్పుల తర్వాత ‘ది కేరళ స్టోరీ 2’ తుది నిడివి 2 గంటల 11 నిమిషాలుగా ఖరారైంది. మొదటి భాగం లాగే ఈ సీక్వెల్ కూడా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తుందో లేదో చూడాలి. అన్ని అడ్డంకులను దాటుకుని ఈ చిత్రం ఈ నెల ఫిబ్రవరి 27, 2026న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజావార్తలు
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..