Vemulawada: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం సందర్భంగా భారీగా భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారికి కోడె మొక్కలు చెల్లిస్తున్న భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుండటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ హోలీ పండుగ సెలవు దినం కావడంతో.. భక్తుల రద్దీ పెరిగిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
Read also: OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..
నిన్న (ఆదివారం) రాజన్న ఆలయానకిఇ భక్తులు అధిక సంఖ్యంలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతం అంతా కోలాహలంగా మరింది. ఆలయ పరిసరాలన్నీ భక్తుల శివనామస్మరణతో మారు మ్రోగాయి. రాజన్న భక్తులు ముందుగా స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు తర మొక్కులు చెల్లింఉకున్నారు. ప్రతి రోజు వేములవాడ ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే భక్తులు వేల సంఖ్యలో రాస్తుండటంతో ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎటువంట అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ఇవాళ హోలీ పండుగ సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు.
Tapsee: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్?