ప్రతి వారం థియేటర్లతో పాటుగా ఓటీటీలో కూడా సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది.. ఓటీటీ సంస్థలు కొత్త కొత్త సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి.. అదే విదంగా ఈ వారం కూడా సరికొత్త సినిమాలు ఓటీటీలో సిద్ధంగా ఉన్నాయి.. ఏ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందో ఒకసారి చూద్దాం..
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..
మాలయాళం సూపర్ హిట్ మూవీ ప్రేమలు తెలుగులో కూడా మంచి సక్సెస్ ను అందుకుంది.. పిభ్రవరి 9 న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో పాటుగా బాక్సాఫీస్ షేక్ చేసే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.. ఈ సినిమా మార్చి 29 న స్ట్రీమింగ్ కాబోతుంది..
లూటేరే వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో అదరగొడుతుంది. అదేంటీ అనుకుంటున్నారా..అయితే గత శుక్రవారమే హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చింది ఈ సీరీస్. అయితే ఫస్ట్ రెండు ఎపిసోడ్లను మాత్రమే ఓటీటీ డిస్నీహాట్‌స్టార్ రిలీజ్ చేసింది.. మూడో సిరీస్ ను ఈనెల 28 న స్ట్రీమింగ్ చేయబోతున్నారు..
అలాగే ట్రూ లవర్ సినిమా తమిళంలో సూపర్ హిట్.. గత నెల 10 న విడుదలైన ఈ సినిమా సక్సెస్ టాక్ ను అందుకుంది.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా ఈ నెల 27 న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.
బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టండన్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ పట్నా శుక్లా.. ఈనెల 29 న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది..
అమెజాన్ ప్రైమ్ వీడియో..
హీరో నవీన్ చంద్ర లీడ్ రోల్‌లో నటించిన వెబ్ సిరీస్ ‘ఇన్‌స్పెక్టర్ రిషి’. నందిని జె.ఎస్ దర్శకత్వంలో సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.. యాక్షన్, క్రైమ్ కథ తో రాబోతున్న ఈ సిరీస్ ఈ నెల 29 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది..
నెట్‌ఫ్లిక్స్..
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో..ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ నుంచి వచ్చిన లేటెస్ట్ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో మార్చి 29 న తర్వాత ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కానున్నాయి..
లాల్ సలామ్.. రజినీకాంత్ గెస్ట్ రోల్ చెయ్యగా, విక్రాంత్ హీరోగా చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజయి..ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది..
బుక్‌మైషో..
ది హోల్డోవర్స్…పాల్ గియామట్టి, డావిన్ జాయ్ రాండోల్ఫ్ మరియు డొమినిక్ సెస్సా లీడ్ రోల్ చేసిన ఈ సినిమా ఇక్కడ 29 న స్ట్రీమింగ్ కాబోతుంది..