Kadiyam Srihari : ఉమ్మడి వరంగల్ జిల్లాకు దేవాదుల ఎత్తిపోతల పథకం ఒక వరప్రదాయమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని ఆయన చెప్పారు. పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాలకు ఇది అత్యంత ఉపయోగకరంగా మారబోతుందని వివరించారు. గత ప్రభుత్వ కాలంలో దేవాదుల ప్రాజెక్ట్ పూర్తి కాలేదని శ్రీహరి ఆరోపించారు. అప్పటి పాలకులకు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి ఉండటంతో, దేవాదుల పనులు నిర్లక్ష్యం పాలయ్యాయని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేవాదుల ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. ఇంకో 2 నుండి 3 వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్ట్ పూర్తవుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం అనేకసార్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన విషయాన్ని గుర్తుచేశారు.
Car Purchase: బడ్జెట్‌లో కారు కొనాలనుకుంటున్నారా.? అయితే ముందు వీటిని తెలుసుకోండి!
తాజాగా ఈ ప్రాజెక్ట్ పనుల కోసం టెండర్లు పిలిచినప్పటికీ, కేటాయించిన మొత్తం సరిపోక కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారని ఆయన తెలిపారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి అవసరమైన బడ్జెట్ పెంపుకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. దీంతో పనులు తిరిగి ప్రారంభం కానున్నాయని స్పష్టం చేశారు. “మేము అడిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి సాంక్షన్లు ఇచ్చినందుకు మా నియోజకవర్గాల ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు” అని కడియం శ్రీహరి తెలిపారు.
గ్లామరస్ లుక్‌తో మెస్మరైజ్ చేసిన మోనాల్.. వైరల్ అవుతున్న ఫోటోలు