NTV Telugu Site icon

Dengue Outbreak: మారిన వాతావ‌ర‌ణం- గ్రేట‌ర్ పై వైర‌ల్ పంజా

Dengue

Dengue

మారిన వాతావరణంతో గ్రేటర్ పై వైరల్ జ్వారాలు పంజా విసురుతున్నాయి. చిన్న, పెద్ద జలుబు, దగ్గు, జ్వరం ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షం, చల్లటి గాలులతో ఒక్కసారిగి వాతావరణం మారిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు బయట రోగుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఉస్మానియా ఆసుపత్రిలో గత రెండు రోజులుగా ఓపీ సంఖ్య 2వేలు దాటుతోది. నల్లకుంట ఫీవర్ ఆసుప్రతికి సాధారణ రోజుల్లో 200 నుంచి 300 రోగుటు వస్తే.. ప్రస్తుతం 500 దాటుతోంది. ఇంట్లో ఒకరి నుంచి మరొకరికి వేగంగా వైరల్ జ్వారాలు సోకుతున్నాయి. రోగుల్లో 70 నుంచి 80 శాతం మంది ముక్కు కారటం, ముక్కు దిబ్బడ, గొంగు నొప్పి, తుమ్ములు, దగ్గు, కళ్ల వెంటనీరు కారడం, ఒళ్లు నొప్పులు, జ్వరం తదితర లక్ష‌ణాలతో వైద్యులను ఆశ్ర‌యిస్తున్నారు.

read also: YS Sharmila: వైఎస్‌ షర్మిల పాదయాత్రకు బ్రేక్‌.. హైదరాబాద్‌కు షర్మిల..

అయితే.. ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగీ చుక్కలు చూపిస్తోంది. కాగా.. 9 ట్రైబల్ జిల్లాల్లో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ప‌లు జిల్లాల్లో శాంపిలే సేకరణ జరుగుతుంది. ఈనేప‌థ్యంలో.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ రికార్డుల ప్రకారం కేసులు సంఖ్య తక్కువగా కనిపించినప్పటికీ, లెక్కల్లో ఎక్కని డెంగీ కేసులు భారీగా ఉన్నట్లు స్వయంగా డిపార్ట్మెంట్ లోనే చర్చ, ఏజెన్సీ ఏరియాల్లో ప్రతీ గ్రామంలో డెంగీ బారిన పడి బాధితులు మంచం ఎక్కుతున్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం డెంగీ కేసులు ఎక్కువగా తేలుతున్నాయి. మ‌రో స్థానంలో మహబూబాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, నిర్మల్ జిల్లాలున్నాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటికే 114 కేసులు అధికారికంగా రికార్డు చేశారు. కానీ అనధికారికంగా కేసులు భారీగా ఉంటాయని అధికారులఅంచనా..

అయితే.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వర్షాకాలంలో అంటు , కాలానుగుణ వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి నివారణ చర్యలు తీసుకోవాలని ప్ర‌జ‌ల‌ను కోరింది. పరిసరాలు ఇంటితోపాటు ఉంటే అంటువ్యాధులు సోకే అవకాశం ఉందని, ప్ర‌జ‌లు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దోమలు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులను వ్యాప్తి చేయగలవు కాబట్టి అంటువ్యాధుల వ్యాప్తిని తగ్గించడానికి ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడం మంచిదని జిహెచ్ ఎంసీ హెచ్చ‌రించింది.

KS.Ramarao: ‘క్రియేటివ్ కమర్షియల్స్’ రామారావు!

Show comments