2 Thousand Notes: ఏం చెప్పాల్రా బై.. పంచబోతే కష్టం.. పంచకుంటే నష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election scenario: సమ్మర్ సీజన్లో మామిడిపండ్ల అమ్మకం.. ఎన్నికల సీజన్లో మందు బాటిళ్ల పంపకం తప్పనిసరి. కరెన్సీ నోటు చూపకుంటే.. మందు బుడ్డీ ఇవ్వకుంటే గెలవడం కష్టం అంటున్నారు నేతల అనుచరులు. గత ఎన్నికల సమయంలో రెండువేల నోట్లు ఉన్నాయి. కనుక నగదును తరలించడం.. పంచడం సులువైంది. అయితే ప్రస్తుతం రెండు వేల నోట్లు రద్దు చేశారు. దీనితో 500 వందల నోట్ల పైన ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. రేడు వేల నోటు తో పోలిస్తే 500 వందల నోట్ల పంపకం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఇంట్లో రెండు ఓట్లు ఉన్నాయి అనుకోండి కేవలం ఒక రెండు వేల నోటు ఇస్తే సరిపోతుంది. కానీ అదే 500 నోట్లు అయితే 4 ఇవ్వాలి. ఇంకా చెప్పాలంటే నగదుని రవాణా చేసేందుకు కూడా రెండు వేల నోట్లు అయితే సులువుగా ఉంటాయి. ఎందుకంటే ఓ లక్ష రూపాయలు అయిన రెండు వేల కట్ట సన్నగా ఉంటుంది.
Read also:Anasuya Bharadwaj: మత్తు కళ్ళు అందాలతో మతి పోగొడుతున్న అనసూయ…
Also Read
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Kabaddi Tournament : వేములవాడలో కబడ్డీ సందడి.. 33 జిల్లాల నుంచి 68 జట్లు.!
కనుక 10 లక్షలైనా ఓ చిన్న బ్యాగ్ లో పెట్టుకుని సులువుగా రవాణా చెయ్యొచ్చు. కానీ 500 రూపాయలు అలాకాదు. పైగా ఎన్నికల సీజన్ కనుక పోలీసులు, కేంద్ర బృందాల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగదు, మందు పంచడానికి నేతలు అనుచరులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి అనుచరుడు మాట్లాడుతూ.. ఎన్నికల సమయం కావడం చేత అధికారుల తనికీలు ముమ్మరం అయ్యాయని.. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో నగదును రవాణా చేయడం.. పంచడం కష్టంగా మారిందని.. రెండు వేల నోట్లు రద్దు కావడంతో నగదును పంచడం, రవాణా చేయడం కష్టంగా మారిందని.. అలా అని నగదు, మందు పంచకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. ఓటమి తప్పదని అందుకే ఎంతకష్టమైన పంచుతున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!