Software Deepthi: జగిత్యాల జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దీప్తి కేసును పోలీసులు ఛేదించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. చివరకు హంతకులు దీప్తి సోదరి, ఆమె ప్రియుడు అని తేల్చారు. దీప్తి సోదరి చందనతో పాటు ఆమె ప్రియుడికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. వారిని రహస్య ప్రాంతంలో విచారించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కేసులో సోదరిపై మొదటి నుంచి అనుమానం ఉంది. అయితే హత్య జరిగిన రెండో రోజు తన అన్నకు ఫోన్ చేసిన చందన.. తనకు ఏ పాపం తెలియదని కన్నీరుమున్నీరైంది. దీంతో అసలు హంతకుడు ఎవరనే ఉత్కంఠ కొనసాగింది. చివరకు పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీప్తి మృతి చెందిన రోజే చెల్లెలు చందన కనిపించకపోవడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. తెల్లవారుజామున బస్టాండ్‌లో ప్రియుడితో కలిసి ఉండడం కూడా అనుమానాలకు బలం చేకూర్చింది. ఎట్టకేలకు అది నిజమైంది.
Read also: ప్రెగ్నెన్సీలో వాంతులు.. పరిష్కారానికి చిట్కాలు
భీమునిదుబ్బ ప్రాంతంలో దంపతులు బంకా శ్రీనివాస్‌రెడ్డి, మాధవి నివాసం ఉంటున్నారు. వీరికి దీప్తి (24), చందన, సాయి అనే ముగ్గురు పిల్లలు. దీప్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. రెండో కూతురు చందన బీటెక్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె ఇంట్లో ఖాళీగా ఉంది. కొడుకు సాయి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. బంధువులు రావడంతో శ్రీనివాస్‌రెడ్డి దంపతులు ఆదివారం హైదరాబాద్‌కు బయలుదేరారు. సోమవారం రాత్రి 10 గంటలకు తల్లిదండ్రులిద్దరూ తమ కుమార్తెలతో ఫోన్‌లో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం మళ్లీ ఫోన్ చేయగా పెద్దమ్మాయి దీప్తి ఫోన్ రిసీవ్ చేయలేదు. చిన్న కూతురు చందన ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్‌లో ఉంది. వెంటనే ఇంటి పక్కనే ఉన్న వారికి సమాచారం అందించారు. వారు ఇంటి తలుపులు తెరిచి చూడగా దీప్తి అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. అనంతరం స్థానిక సమాచారంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సోఫాలో దీప్తి మృతదేహం పడి ఉండగా వంటగదిలో రెండు మద్యం సీసాలు, శీతల పానీయం సీసా, ఫుడ్ ప్యాకెట్లు కనిపించాయి. చెల్లి చందన కనిపించకుండా పోవడంతో ఆమె ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సోమవారం ఉదయం 5.12 గంటల నుంచి 5.16 గంటల వరకు ఓ యువకుడితో కలిసి నిజామాబాద్ బస్టాండ్‌లో కూర్చుంది. ఆ తర్వాత నిజామాబాద్ వెళ్తున్న బస్సు ఎక్కినట్లు కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో అసలు వ్యవహారం బయటకు వచ్చింది.
Manchiryala: బ్యాంకులో దొంగకు వింత అనుభవం.. ఫన్నీ లెటర్ రాసి పరార్