జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన లో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. బాలికపై అత్యాచారం ఘటనలో ఇప్పటి వరకూ ఐదుగురుని అదుపులో తీసుకున్నారు. అయితే ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డా దాసోజు శ్రవణ్ స్పందించారు.
నిందితులను అరెస్ట్ చేయడానికి బదులుగా, కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం వెనుక కుట్ర దాగి ఉందని.. డ్రగ్, పబ్ కల్చర్ కి పరాకాష్టగా మారిన హైదరాబాద్ లో తాజాగా ఒక పబ్ నుండి టీఆర్ఆర్, ఎంఐఎం పార్టీ చెందిన పెద్దల పిల్లలు ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన అరాచక చర్యని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖడించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలిక అత్యాచార ఘటనలో నిందుతులు ఎంతటివారైన కఠినంగా శిక్షించాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేసారు.
జూబ్లీహిల్స్ అత్యాచార నిందుతులు ఎంతటివారైన కఠినంగా శిక్షించాలి.
డ్రగ్.పబ్ కల్చర్ కి పరాకాష్టగా మారిన హైదరాబాద్.డ్రగ్స్ కల్చర్ పై ఉక్కుపాదం మోపాలని గతంలో ఎన్ని సార్లు చెప్పిన వినిపించుకోని ప్రభుత్వం.ఇప్పుడు అధికార పార్టీ చెందిన వారి పిల్లలే ఇలాంటి దాస్టికానికి పాల్పడటం దుర్మార్గం pic.twitter.com/aTfplSNYjt— Prof Dasoju Srravan (@sravandasoju) June 3, 2022